34.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

సెమీస్‌ ఫైట్‌కు టీమిండియా సిద్ధమేనా?

ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్‌ పోరుకు సర్వం సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్‌పై ఫైనల్స్‌ కంటే ఎక్కువగా ఉత్కంఠ నెలకొందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ మ్యాచ్‌ జరగబోయేది భారత్, ఆస్ట్రేలియా మధ్య కాబట్టి. గెలిచిన వాళ్లు ఫైనల్స్‌కి.. ఓడిని వాళ్లు ఇంటికి. అందుకే ఈ మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ICC ఈవెంట్స్‌లో ఆస్ట్రేలియా తన విశ్వరూపం చూపిస్తుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికే వన్డే వరల్డ్‌ కప్‌కు సంబంధించిన చేదు జ్ఞాపకాలను క్రికెట్ అభిమానులు మర్చిపోలేదు. అందుకే ఈసారి ఎలాగైనా కంగారు టీమ్‌ను కంగారు పెట్టి.. మట్టి కరిపించాలని ప్రార్థనలు చేస్తున్నారు.

ఇక ఇరు టీమ్స్ చూస్తే సమ ఉజ్జీలుగా ఉన్నారనే చెప్పాలి. నిజానికి గతంతో పోలిస్తే ఆసీస్‌ టీమ్‌ చాలా వీక్‌ అనుకున్నారంతా. ఎందుకంటే హేజిల్ వుడ్, స్టార్క్, మార్ష్‌, కమ్మిన్స్ ఎవరూ టీమ్‌లో లేరు. కానీ ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ టీమ్‌ ఓడలేదు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఆసీస్‌కు ఐసీసీ ఈవెంట్స్ అనగానే ఎలా పూనకం వస్తుందో.

భారత్ సంగతేంటి?

టీమిండియా ఇప్పటి వరకు హ్యాట్రిక్ విక్టరీలు సాధించింది. టీమిండియా బ్యాటింగ్ లైనప్ అదిరిపోయిందనే చెప్పాలి. విరాట్, కోహ్లీ, గిల్, శ్రేయస్, అక్షర్, హార్దిక్ ఇలా తమ సత్తా చాటుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఒకరు విఫలమైతే.. మరొకరు టీమిండియాను నిలబెట్టారు. ఇక బౌలింగ్ లైనప్ కూడా చాలా బాగా ఉంది. షమీ, అర్షదీప్, హర్షిత్ రాణా రాణిస్తున్నారు. ఇక స్పిన్నర్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుణ్‌, కుల్దీప్, జడేజా, అక్షర్‌ తమ బౌలింగ్‌తో మ్యాచ్‌ను తిప్పేస్తున్నారు. అయితే బ్యాటింగ్ విషయంలో కాస్త తడబాటుగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఓపెనర్లు వికెట్ పడకుండా ఎక్కువ స్కోర్ చేయలేకపోతున్నారు.

మరి ఆసీస్ సంగతేంటి?

ఇక ఆస్ట్రేలియా గురించి మనం ముందు చెప్పుకున్నట్టుగా ప్రస్తుతం వీక్‌గానే కనిపిస్తోంది. ముఖ్యంగా కంగారుల బౌలింగ్ ఇప్పుడు మనకు అడ్వాంటేజ్. బ్యాటింగ్‌లో భారీ స్కోర్ చేయకపోతే టీమిండియాకు కష్టాలు తప్పవనే చెప్పాలి. ఎందుకంటే హెడ్, స్మిత్, మాక్స్‌వెల్.. ఏ సమయంలో చెలరేగి ఆడతారో తెలియని పరిస్థితి. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే భారత్ భారీగా పరుగులు చేయాల్సి ఉంటుంది. లేదంటే టార్గెట్‌ను ఛేజ్ చేసేస్తారు. ఇక బౌలింగ్ వస్తే మాత్రం తక్కువ పరుగులకే ఆసీస్‌ను కట్టడి చేయాల్సి ఉంటుంది.

మ్యాచ్‌లో ఉండేదెవరు?

ఆసీస్‌తో జరిగే మ్యాచ్‌లో పంత్ ఆడతాడా? షమీని పక్కన పెట్టి హర్షిత్‌ను ఆడిస్తారా? ఫైనల్ టీమ్‌లో ఉండేది స్పెషలిస్ట్ స్పిన్నరా? లేక ఆల్‌రౌండరా.. ? ఇలా అనేక ప్రశ్నలు ఇప్పటికే ఫ్యాన్స్ బుర్రను తొలిచేస్తున్నాయి. కెప్టెన్ రోహిత్‌ కూడా ఫైనల్‌ టీమ్‌ను సెలెక్ట్ చేయడం పెద్ద టాస్క్‌ అని ఇప్పటికే అనౌన్స్ చేశాడు. దీంతో ఫైనల్‌ టీమ్‌లో బెర్త్ దక్కించుకునేది ఎవరన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com