39.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

ఈసారి ఢిల్లీ గద్దెపై కూర్చునేది కొత్త మొఖమేనా?

  • వ్యూహం మారుస్తున్న అధిష్టానం?
  • ఈసారి కొత్త వ్యక్తికి సీఎం పదవి?
  • రాజస్థాన్, హర్యానా, ఒడిషా ల మాదిరే అదే పాలసీ?
  • అదే నిజమైతే పర్వేష్‌ కు నో ఛాన్స్
  • బరిలో అనేకమంది ఆశావహులు
  • రేపే కొత్త సీఎం ప్రమాణం..

ఢిల్లీ కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపి అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఈనెల 20 అంటే రేపు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నందున ఏ క్షణాన్నైనా సీఎం ని ప్రకటించే అవకాశముంది.ఈసారి వెనుకబడిన వర్గాల మహిళలకు అప్పగిస్తారని ఊహాగానాలు రేగినా చివరికి కేజ్రీవాల్‌ పై పోటీ చేసి గెలిచిన పర్వేష్‌ వర్మకే ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పర్వేష్‌ వర్మ, విజేందర్ గుప్తా, సతీష్‌ ఉపాధ్యాయ, వీరేంద్ర సచ్ దేవ్, హరీష్‌ ఖురానా, పవన్ శర్మ, ఆశీష్‌ సూద్, రేఖాగుప్తా, షికా రాయ్, రవీందర్ ఇంద్రజ్ సింగ్‌, కైలాష్‌ గంగ్‌ వాల్‌ తదిరుల పేర్లు తెరపైకి వస్తున్నాయి.

రొటీన్ కి భిన్నంగా…

ఈసారి సీఎం ఎంపికపై బీజేపి కొత్త సంప్రదాయానికి తెర తీస్తోందనిపిస్తోంది. బాగా పేరున్న,సీనియారిటీ, వారసత్వం తదితర ప్రమాణాలను పక్కన పెట్టి ఒక కొత్త ముఖాన్ని తెరపైకి తెచ్చే విషయంపై అధిష్టానం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. రిజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్‌, ఒడిషా, చత్తిస్ గఢ్‌ తదితర రాష్ట్రాలకు ఎంపిక చేసిన తీరులోనే పెద్దగా ప్రచారంలో లేని కొత్త పేరు బయటకొచ్చేలా కనిపిస్తోంది.

పర్వేష్‌ వర్మకు చేజారినట్లేనా?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజక వర్గానికి ఒక ప్రత్యేకత ఉంది.. ఇప్పటి వరకూ సీఎంలు అయినవారందరూ ఆ నియోజక వర్గం నుంచే అయ్యారు.మొన్నటి ఎన్నికల్లో హోరా హోరీగా సాగిన పోటీలో బీజేపి గెలిచి అధికారం దక్కించుకుంది. న్యూఢిల్లీ నియోజక వర్గం సీఎంని డిసైడ్‌ చేసే నియోజక వర్గం అనుకోవాలి. ఎందుకంటే అప్పుడెప్పుడో స్వల్పం కాలం సుష్మా స్వరాజ్ బీజేపి నుంచి ఢిల్లీ సీఎం గా పరిపాలించినా ఢిల్లీపై కాంగ్రెస్, ఆప్‌ లదే అసలు పట్టు.. ఎందుకంటే కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ ఏకంగా ముడుసార్లు అదే నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొంది సీఎం అయ్యారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఢిల్లీ గద్దెని సామాన్యుడు సైతం అధిరోహించగలడని నిరూపించాడు కేజ్రీవాల్‌.. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపిలతో పోలిస్తే ఆప్ పార్టీ ట్రాక్ రికార్డు తక్కువే. అయితేనేం రెండు సార్లు తిరుగులేని మెజారిటీతో గెలిచి అధికారం చేపట్టిన ఘనత కేజ్రీవాల్‌ దే..ముచ్చటగా మూడోసారి గెలవాలని కేజ్రీవాల్‌ ఆశపడినా ఈసారి బీజేపి గెలిచి ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది. గతంలో ఢిల్లీ సీఎంగా వ్యవహరించిన సాహిబ్ సింగ్‌ వర్మ కూడా ఇదే నియోజక వర్గం నుంచి గెలిచారు. అంతకుముందు షీలా దీక్షిత్ నియోజక వర్గం కూడా ఇదే.. మరిప్పుడు లెక్క ప్రకారం అయితే పర్వేష్‌ వర్మను సీఎం పదవి వరించాలి. కానీ రొటీన్ కు భిన్నంగా ఎంపిక జరిగితే మరో కొత్త ముఖం తెరపైకి రావోచ్చు.

ముక్కోణపు పోటీలో వర్మ గెలుపు

ఢిల్లీ సీఎం అభ్యర్ధిని నిర్ణయించే నియోజక వర్గంగా న్యూఢిల్లీ పేరు పడింది. అన్ని పార్టీలు ఈ నియోజక వర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈసారి అరవింద్‌ ను ఓడించేందుకు ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్‌ దీక్షిత్‌ ను కాంగ్రెస్ రంగంలోకి దింపగా, బీజేపి నుంచి మరో మాజీ సీఎం సాహిబ్‌ సింగ్‌ వర్మ కుమారుడు పర్వేష్‌ వర్మ పోటీలో నిలిచారు. ఆప్‌ నుంచి అరవింద్‌ కేజ్రీవాల్‌ పోటీ పడ్డారు.వాస్తవవానికి ఇది ముక్కోణపు పోటీయే అయినా కేజ్రీవాల్‌, పర్వేష్‌ వర్మ మధ్యనే హోరా హోరీ పోటీ నడిచింది.సందీప్‌ దీక్షిత్‌ పెద్దగా ప్రభావం కనపరచలేకపోయారు. ఈ ముక్కోణపు పోటీలో పర్వేష్‌ వర్మ ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై 4,089 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com