24.7 C
Hyderabad
Tuesday, September 22, 2026

Live Video

spot_img

గురుకులాల్లో ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెట్టండి – డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం

  • హాస్టళ్లు, గురుకులాల అద్దె భవనాల బకాయిలు వెంటనే చెల్లిస్తాం

  • ఉద్యోగ కల్పన కేంద్రాలుగా స్టడీ సెంటర్లో ఉండాలి

  • బీసీ సంక్షేమ, రవాణా శాఖల ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌

 

అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల అద్దె బకాయిలు వెంటనే విడుదల చేస్తామని, అవసరమైన ప్రతిపాదనలు తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో మరమ్మతులు చేపట్టాలని, కిటికీలు, ప్రధాన ద్వారాలకు కూడా దోమతెరలు ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన నిధులు వెంటనే కేటాయిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

బీసీ స్టడీ సెంటర్లు ఉద్యోగ కల్పన కేంద్రాలుగా ఉండాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ క్యాలెండర్‌ను అనుసరించి స్టడీ సెంటర్లలో కోచింగ్ నిర్వహించాలని కోరారు. డీఎస్సీ, బ్యాంకింగ్ వంటి పరీక్షల పై దృష్టి సారించాలని ఆదేశించారు. గురుకులాల్లో ఒకేషనల్ కోర్సులు ప్రవేశం పెట్టడం మూలంగా ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. రెగ్యులర్ కోర్స్‌తో పాటు ఒక కోర్స్ ఒకేషనల్ కోర్సులకు కేటాయించాలని.. అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. రెసిడెన్షియల్ పద్ధతిలో విద్యార్థులు పూర్తిగా అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెడితే ప్రయోజనం ఉంటుందని తెలిపారు.

ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలు.. వాటి నిర్వహణకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. ఆర్టీసీ ఆస్తులు.. నిర్వహణ, ఆదాయ వనరులపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, ఆర్టీసీ ఎండి సజ్జనార్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com