25.1 C
Hyderabad
Tuesday, June 30, 2026

Live Video

spot_img

మే 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్ బోర్డు స్పష్టత ఇచ్చింది. ఈ పరీక్షలు మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్టు తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

ఈ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకున్న విద్యార్థులు ఈ నెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పరీక్ష ఫీజును చెల్లించేందుకు గడువు విధించారు. ఇక, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రాత పరీక్షలు మే 12 నుంచి 20 వ తేదీ వరకు రెండు సెషన్లలో నిర్వహించనుండగా, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 28 వ తేదీ నుంచి జూన్ 1 వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు వెల్లడించింది.

ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చి 2025 పరీక్షల కోసం రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్ ఫీజు ఏప్రిల్ 13వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com