23.2 C
Hyderabad
Wednesday, July 29, 2026

Live Video

spot_img

ఇండస్ నదీ జలాల ఒప్పందం రద్దు!!

  • ఉగ్రదాడికి నిరసనగా భారత్ నిర్ణయం
  • 1960 సెప్టెంబర్ 19న ఇండస్ నదీజలాల ఒప్పందం
  • రెండు దేశాల మధ్య ప్రవహిస్తున్న ఆరు కీలక నదులు
  • తూర్పుకు ప్రవహించే నదులపై హక్కులు భారత్ కు
  • పడమట వైపు ప్రవహించే నదులపై హక్కు పాకిస్థాన్ కు
  • పడమట నదులపై హైడ్రో ఎల్టక్ట్రిసిటీ ప్రాజెక్టుల నిర్వహణ మనదే
  • రెండు దేశాలు పరస్పరం సమాచారం బదిలీ చేసుకోవాలి
  • ఏడాదికోసారి రెండు దేశాల్లో సమావేశమవ్వాలి
  • పరిస్థితులకనుగుణంగా నదీ జలాల ఒప్పందంలో మార్పులు, చేర్పులు
  • పరస్పర సహకారం, ఇచ్చిపుచ్చుకునే ధోరణే కీలకం

భారత పాకిస్థాన్ దేశాల మధ్య అనేక నదులు ప్రవహిస్తున్నాయి. ఈ జలవనరులన్నీ రెండు దేశాలు సమానంగా పంచుకుని, నదీ జలాల ఒరవడి, ప్రవాహానికి సంబంధించిన సమాచారం ఇచ్చి పుచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే పెహల్గాం లో ఉగ్రదాడి కి నిరసనగా ఈ ఒప్పందం అమలును భారత్ నిలిపివేసింది. ఇండస్ నదీ జలాల సమాచారం బదలాయింపు కూడా ఆపేశారు.
అసలు ఇండస్ వాటర్ ట్రిటీ ఎప్పుడు మొదలైంది? దాని పూర్వ పరాలు..

1960 సెప్టెంబర్ 19న భారత,పాకిస్థాన్ దేశాల మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందం మొదలైంది. దాదాపు 9 ఏళ్ల చర్చల తర్వాత ప్రపంచ బ్యాంకు సంతకంతో రెండు దేశాల మధ్య ఈ ఒప్పందంకుదిరింది.
రెండు దేశాల మధ్య ప్రవహిస్తున్న అంతర్గత నదీ జలాల వినియోగానికి సంబంధించిన సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం ఒప్పందం ముఖ్యోద్దేశం
ఈ ఒప్పందం ప్రకారం మన దేశంలో తూర్పు వైపు ప్రవహించే రావీ, బియాస్,సట్లెజ్ మొదలైన ఆరు నదులు మూడుకోట్ల ఎకరాల అడుగుల మేర ప్రవహిస్తున్నాయి. ఈ జలాలను మన దేశం ఎలాంటి నియంత్రణ లేకుండా నిరంతరాయంగా వాడుకునే సదుపాయం ఉంది.
పడమట దిశగా ప్రవహించే ఇండస్, చీనాబ్, జీలం నదులు కోటీ 35 లక్షల ఎకరాల అడుగుల మేర పాకిస్థాన్ వైపు ప్రవహిస్తున్నాయి. ఈ నదీ జలాలలో సింహభాగం పాకిస్థాన్ కు కేటాయించబడ్డాయి.
ఒప్పందం ప్రకారం పడమట దిక్కున ప్రవహించే నదులపై ప్రాజెక్టుల నిర్మాణానికి, ప్రత్యేక నిబంధనల ప్రకారం హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉత్పాదన భారత్ కు నిర్వహణ హక్కులున్నాయి.
పడమట దిక్కున ప్రవహించే నదులపై నిర్మించే ప్రాజెక్టులపై ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని వెల్లడించే హక్కులు పాకిస్థాన్ కు ఉన్నాయి.
ఈ నదులకు ఇరు వైపులనుంచి ఇద్దరు కమిషనర్లను నియమించారు. వారు ఏడాదికొకసారి మన దేశంలో లేదా పాకిస్థాన్ లో సమావేశమవ్వాలని నిబంధనలున్నాయి. ఇరు దేశాల మధ్య ఢిల్లీలో 2020న సమావేశం జరగాల్సి ఉండగా కోవిడ్‌ పాండమిక్ కారణంగా రద్దయ్యింది.
రెండు దేశాలు ఈ ఇండస్ నదీ జలాల ఒప్పందాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలని కూడా నిబంధనలు చెబుతున్నాయి.
ఇండస్ నదీ జలాలను భారత, పాకిస్థాన్ దేశాలు పరిపూర్ణంగా, సమగ్రంగా వినియోగించుకోవాలని అందులో జలాలను పూర్తిగా వాడుకోవాలని అయితే పరస్పర సహకారం, స్నేహ పూర్వక ధోరణిలో మాత్రమే ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు జరగాలని ఒప్పందం పీఠికలో ఉంది. రెండుదేశాలు తమ మధ్య అభ్యంతరాలను పరస్పర సహకార ధోరణిలో పరిష్కరించుకోవాలని, పరిస్థితులకనుగుణంగా నిబంధనలను మార్చుకోవడం, అన్వయించు కోవడం లాంటివి చేయాలని అప్పుడే ఈ ఒప్పందం లక్ష్యాలు నెరవేరుతాయని కూడా ఒప్పంద పీఠికలో ఉంది.
ఈ ఒప్పందాన్ని అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్‌ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు మార్షల్‌ మహమ్మద్ ఆయుబ్ ఖాన్ పరస్పరం అంగీకరించి సంతకాలు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com