బాక్సంగ్ డే టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఓటమి పాలయ్యింది. 184 పరుగుల తేడాతో హోమ్ టీ ఆస్ట్రేలియా భారత్ జట్టుపై విజయం సాధించింది. ఈ టెస్ట్ మ్యాచ్ గెలుపుతో బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. దీంతో 2023-25 ప్రపంచ క్రికెట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకునే అవకాశాలు ఆస్ట్రేలియాకు మెరుగయ్యాయి. ఇదేసమయంలో బాక్సింగ్ డే టెస్ట్ ఓటమి కారణంగా టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ నుంచి తప్పుకున్నట్లైంది. మెల్బోర్న్ లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో చివరి రోజు 34 పరుగుల విజయ లక్ష్యంతో క్రీజ్ లోకి దిగిన టీమిండియా 155 పరుగులకే ఆలౌట్ అయ్యింది. యశస్వి అత్యధికంగా 84 పరుగుల చేసినప్పటికీ మిగితా టాప్ అర్డర్ బ్యాట్స్ మెన్లు ఎవరూ అతనికి సహకరించేలా ఆడలేకపోయారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు చివరి రోజు బ్యాటింగ్ లో దారుణంగా విఫలమయ్యారు. రిషబ్ పంత్ మినహా మిగిలిన ఆటగాళ్ళందరూ సింగిల్ డిజిట్ పరుగులకే పరిమితమైపోయారు. వాషింగ్టన్ సుందర్ 5 పరుగులే చేనిప్పటికీ టెస్ట్ మ్యాచ్ లకు తగ్గట్లు ఆడి 45 బందులు ఎదుర్కొన్నాడు. ఆసీస్ పేసర్లలో ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ లు చెరొ మూడు వికెట్లు పడగొట్టగా, నాధన్ రెండు, ట్రవిస్, మిచెల్ స్టార్క్ లు చెరో వికెట్ పడగొట్టారు.