కన్నడ నటి శోభిత ఆత్మహత్యకు మూడు రోజుల ముందు గోవాకు వెళ్లినట్టు పోలీసుల విచారణలో తేలింది. శోభిత, సుధీర్ గోవాలో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొన్నారు. అక్కడ ఫోటోలలో కూడా ఇద్దరూ చాలా సంతోషంగానే కనపడ్డారు. మరోవైపు శోభిత తల్లిదండ్రులు సుధీర్ మీద ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు.
శోభిత లాస్ట్ కాల్ వాళ్ళ అక్కతో మాట్లాడింది… ఇక్కడ అంతా బాగుంది… రెండు వారాలలో ఊరుకి వచ్చి కలుస్తాం అని వాళ్ళకి చెప్పింది అంటున్న పోలీసులు. కర్ణాటకలోని సఖిలేష్ పురం శోభిత సొంత ఊరు అని వెల్లడించారు. సుధీర్ సాఫ్ట్ వేర్, శోభిత సినీ ఇండస్ట్రీలో పని చేస్తోంది.
సుధీర్ పై శోభిత తల్లిదండ్రులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. పక్కన ఇంటి వాళ్ళతో శోభిత తల్లిదండ్రులు మాట్లాడగా..ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారని పొరుగింటి వాళ్లు చెప్పారు.
అయితే ఈ కేసులో పోలీసులకు సూసైడ్ నోటు దొరికింది. కన్నడ నటి శోభిత నివాసంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న గచ్చిబౌలి పోలిసులు…సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్ అంటూ లేఖలో ఉందని తెలిసింది. ఎవరిని ఉద్దేశించి శోభిత సూసైడ్ నోట్ లేఖ రాసిందన్న కోణంలో దర్యాప్టు సాగుతోంది.
శోభిత మృతికి డిప్రెషన్ కారణమా అనే కోణంలో విచారణ చేస్తున్న పోలీసులు…సీరియల్స్, మూవీస్ కి దూరంగా ఉండటమా.. అనే కొణంలో కూడా విచారణ చేస్తున్నారు.