24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం పకడ్బందీగా అమలు : డిప్యూటీ సీఎం భట్టి

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సీరియస్ గా తీసుకొని అమలు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధులపై 32 శాఖల పనితీరుపై సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా కేటాయించిన నిధులు, చేసిన ఖర్చు, గత ఎడాది ఖర్చు చేయకుండా మిగిలిపోయిన నిధులు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ , ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం అన్ని శాఖల్లో ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని… అమలుకు సపోర్ట్ యూనిట్ ఇప్పటికే ఉంటే ఇబ్బంది లేదు, లేని పక్షంలో సపోర్ట్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలని ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు. అన్ని శాఖల్లో సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు అవుతున్నది లేనిది ఇకనుంచి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పర్యవేక్షిస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. సబ్ ప్లాన్ చట్టం అమలుపై సెస్ ఇప్పటివరకు సమర్పించిన నివేదికలు అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్థిక శాఖలో ప్రత్యేకంగా రిసర్చ్ సెంటర్ ఏర్పాటుచేసి ప్రత్యేక పథకాల రూపకల్పన చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధుల ఖర్చుపై అన్ని శాఖలు 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. గిరిజన తండాలకు త్రీ ఫేస్ విద్యుత్ సరఫరా కావాలన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో అధికారులు ఆ మేరకు చర్యలు చేపట్టాలన్నారు. మరో మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేసేందుకు అన్ని శాఖల అధికారులు మంచి పథకాలను సిద్ధం చేసుకుని ఆర్థిక శాఖకు నివేదిక సమర్పించాలన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం గత కాంగ్రెస్ తి ప్రభుత్వం హయాంలోనే వచ్చింది. ఈ పథకం అమలుపై ప్రజా ప్రభుత్వం స్పష్టంగా ఉంది. గత ప్రభుత్వ చర్యల మూలంగా పదేళ్లపాటు అర్హులైన వారు లబ్ధి పొందలేకపోయారు మీ ద్వారా ఆ వర్గాలకు చేయూతను ఇవ్వాలని కోరారు. స్పెషల్ సిఎస్ వికాస రాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్టీ వెల్ఫేర్ సెక్రెటరీ శరత్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్సీ వెల్ఫేర్ శ్రీధర్, ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, సిడిఎమ్ఏ కమిషనర్ శ్రీదేవి, ఆర్టీసీ ఎండి సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com