26.5 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

నాకు బెయిల్‌ వద్దు… బయటకి వెళితే చంపేస్తారు…

అగస్టావెస్ట్‌ల్యాండ్ స్కామ్‌ మద్యవర్తి క్రిస్టియన్‌ మైఖేల్‌ వేడుకోలు

ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఒక పెద్ద స్కామ్‌లో నిందితుడు ఇప్పుడు బెయిల్‌ మీద బయటకు రావడానికి వణికిపోతున్నాడు. అత్యున్నత న్యాయస్ధానం అతనికి బెయిల్‌ మంజూరు చేసినా… నాకు బెయిల్‌ వద్దు మహప్రభో నేను బయటకు వెళితే నన్ను చంపేస్తారు… నేను జైలులోనే ఉంటాను అని వేడుకుంటున్నాడు. నాకు ఎంత శిక్ష వేస్తారో అంత వేసేసెయ్యండి ఆశిక్ష అనుభవించేసి నేను నా దేశానికి వెళ్లిపోతాను అని సదరు నిందితుడు అత్యున్న న్యాయస్ధానానికి మెరపెట్టుకుంటున్నాడు. ఇంతకీ అతనెవరు…? ఆ కేసేంటి అనేగా మీ అనుమానం. అయితే ఈ కథనం చదవండి.

దేశంలో వీవీఐపీల కోసం ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ అనే సంస్ధ నుంచి అత్యాధునిక సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలతో ఉండే AW101 హెలీకాఫ్టర్లను కొనడానికి 2006-2007 ప్రాంతంలో భారత రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, రక్షణమంత్రి, కేంద్ర హోంమత్రి వంటి వీవీఐపీల కోసం 12 అగస్టా వెస్ట్‌ ల్యాండ్‌ AW101హెలికాఫ్టర్ల కొనుగోలు కోసం సుమారు 3600 కోట్లు కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చెయ్యడానికి ఒప్పందాలు జరిగాయి. ఈ డీల్‌లోనే క్రిస్టియన్‌ మైఖేల్‌ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించారు. భారత దేశానికి, అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కంపెనీకి మధ్యవర్తిత్వం వహించి భారతీయ రాజకీయవేత్తలకు, అధికారులకు లంచాలు ఇచ్చాడనే ఆరోపణపై ఇతనిపై సీబీఐ కేసు నమోదు చేసింది. లంచాల కింద దాదాపు 30 మిలియన్‌ యూరోలు అంటే ఇండియన్‌ కరెన్సీలో దాదాపు 283 కోట్ల రూపాయలు అప్పటి రాజకీయ నాయకులు, అధికారులకు లచం ఇచ్చారు. ఈమొత్తాన్ని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దేశంలోని పలు బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఈ హెలికాఫ్టర్ల కొనుగోళ్ళలో అవినీతి జరిగిన మాట వాస్తవమని 2013లో అప్పటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి లోక్‌సభలో ప్రకటించారు. అప్పటి మన్మోహన్‌ నేతృత్వంలోనే యూపీఏ-2 సర్కార్‌ సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆ తరువాత ఇటలీ కోర్టులో అనేక సంవత్సరాలు నడిచిన ఈ కేసులో కొందరికి శిక్షలు కూడా పడ్డాయి.

అయితే 2018లో సీబీఐ క్రిస్టియన్‌ మైఖేల్‌ను దుబాయ్‌ నుంచి ఇండియాకు రప్పించి అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే మగ్గుతున్నారు. తాజాగా మార్చి4వ తేదీన అతనికి ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కానీ నాకు బెయిల్ వద్దని మైఖేల్‌ అందరికీ షాక్‌ ఇచ్చాడు. తనకు బెయిల్‌ వద్దని, తాను బయటకు వెళితే చంపేస్తారని ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. తనకు బెయిల్‌ ఇచ్చేకంటే అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కేసులో వెయ్యా్ల్సిన శిక్ష వేసెస్తే అది అనుభవించి విడుదలైన వెంటనే తన దేశానికి వెళ్లిపోతానని క్రిస్టియన్‌ మైఖేల్‌ న్యాయమూర్తికి తన ఆవేదనను మొరపెట్టుకున్నాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com