స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతీ నక్షత్రం రోజున లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న యాదగిరిగుట్ట గిరి ప్రదక్షణ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. బుధవారం యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ అనంతరం లక్ష్మీ నరసింహస్వామివారి దర్శం చేసుకున్న తరువాత కవిత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల కొంగు బంగారంగా ఏళ్ళతరబడి నిలబడేలా కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయాన్ని మహాద్భుతంగా నిర్మించారని కవిత కొనియాడారు. దాదాపు 1200 కోట్లతో ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించారని కవిత తెలిపారు. స్వయానా లక్ష్మీనరసింహ స్వామే కేసీఆర్‌కు శక్తిని కలిగించి ఆలయ నిర్మాణానికి పూనుకునేలా చేశారని అన్నారు. దేవాలంలో ఇంకా మిగిలి ఉన్న చిన్నాచితక పనులను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చెయ్యాలని ఈ సందర్భంగా కవిత కోరారు. రాజీకీయాలకు అతీతంగా గుడిని అభివృద్ధి చేయాలని, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రతి నెల ఒకరోజు ఎంతో మహోత్సవంగా నిర్వహిస్తున్న లక్ష్మీనరసింహ స్వామివారి గిరిప్రదక్షణలో భక్తులందరూ పాల్గొనాలని కల్వకుంట్ల కవిత అభిలషించారు.