29.2 C
Hyderabad
Monday, June 15, 2026

Live Video

spot_img

వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయంటే..?

సాధారణంగా మనం నివశించే ప్రాంతాలకు, లేదా మనకు తెలిసిన అనేక ప్రాంతాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయనే ఆసక్తి అందరికీ ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలకు సంబంధించి చాలా ప్రాంతాల పేర్లు చిత్ర విచిత్రంగా ఉంటాయి. వాటికి ఆ పేర్లు ఎలా సంక్రమించాయో చాలా మందికి తెలియదు. సికింద్రాబాద్ విషయం తీసుకుంటే ఈ ప్రాంతంలో పలు కాలనీలకు ప్రస్తతం చలామణిలో ఉన్న పేర్ల వెనుక ఆసక్తిక కధనాలు చాలా ఉన్నాయి. ఎంతో ప్రఖ్యాతి పొందిన ఈ ప్రాంతలకు ఆ పేర్లు ఎలా వచ్చాన్న అంశంపై భాస్కర న్యూస్ ప్రత్యేక కథనం.

 

సికింద్రాబాద్… 1800 సంవత్సరానికి పూర్వం ఈ ప్రాంతలో ఆర్మీ క్యాంపు ఉండేది అందుకే అప్పట్లో ఈ ప్రాంతాన్ని లష్కర్ అని పిలిచేవారు. లష్కర్ అంటే ఆర్మీ క్యాంపు అని అర్ధం. ఇక్కడ బ్రిటీష్ సైన్యానికి గుడారాల వసతి కల్పించేవారు. అయితే 1806వ సంవత్సరంలో 3వ నిజాం సికందర్ జా పేరును ఈ ప్రాంతానికి నామకణం చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం సికింద్రాబాద్ గా పిలవబడుతోంది.

ప్యాట్నీ… సికింద్రాబాద్ ప్రాంతంలో ప్రాముఖ్యత కలిగిన మరో ప్రాంతం ప్యాట్నీ. ఒక కార్ల షోరూమ్ పేరుతో ఈ ప్రాంతం ప్రసిద్దికెక్కింది. 1920వ సంవత్సరాంతంలో ఎమ్ఆర్ ప్యాట్నీ అనే ఆటోమొబైల్ ఇంజనీర్ ఈ ప్రాంతంలో కార్ల షోరూమ్ ప్రారంభించారు. ఆ కార్ల షోరూమ్ ఆ ప్రాంతనికి ల్యాండ్ మార్క్ గా అవతరించింది. దీంతో ఆయన పేరుతోనే సికింద్రాబాద్ లో ప్యాట్నీ సెంటర్ స్ధిరపడిపోయింది.

ప్యారడైజ్… ఇక్కడ ఉన్న ప్యారడైజ్ బిర్యానీ సెంటర్ వల్లే ఈ ప్రాంతానికి ప్యారడైజ్ అని పేరు వచ్చిందని చాలా మంది అనుకుంటారు… కానీ అద వాస్తవం కాదు. 1953 ప్రాంతలో ఇక్కడ ప్యారడైజ్ పేరుతో ఒక సినిమా ధియేటర్ ఉండేది. ఆ ధియేటర్ కి అనుబంధంగా ఒక చిన్న కేఫ్, క్యాంటిన్ లు కూడా అదే పేరుతో ప్రారంభించారు. అయితే 1987వ సంవత్సరంలో ప్యారడైజ్ ధియేటర్ దాని క్యాంటిన్ రెండూ మూసి వేశారు. కానీ క్యాంటిన్ అలాగే కొనసాగుతూ నేడు మనం చూస్తున్న ప్రపంచ ప్రఖ్యాత ప్యారడైజ్ బిర్యానీ రెస్టారెంట్ గా కొనసాగుతోంది.

పద్మారావు నగర్… దివాన్ బహదూర్ పద్మారావు మొదలియార్ పేరుతో పద్మారావు నగర్ ఏర్పడింది. సికింద్రాబాద్ పట్టణాభివృద్ధికి ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా పద్మరావు నగర్ పేరును ఆ ప్రాంతానికి పెట్టారు.

బన్సీలాల్‌పేట… స్థానికంగా ప్రముఖ వ్యాపారి సేట్ బన్సీలాల్ గౌరవార్ధం ఆ పేరు పెట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న దిగుడు బావి చుట్టూ కాలనీ అభివృద్ధి చేయడానికి విశేష కృషి చెయ్డమే కాకుండా మౌలిక వసతులకు, ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు సమకూర్చారు సేట్ బన్సీలాల్.

సీతాఫల్‌మండి… ఈ ప్రాంతంలో సీతాఫలాలకి పెద్ద మార్కెట్‌ ఉండేది. ఇప్పుడు కూడా, గ్రామస్తులు మరియు బంజారాలు ఎద్దుల బండ్లలో వచ్చి ఈ పరిసర ప్రాంతాలలో పండ్లను అమ్ముతున్నారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని సీతాఫల్‌మండి అని పిలిచేవారు. అదే పేరు స్ధిరపడిపోయింది.

జేమ్స్ స్ట్రీట్… హైదరాబాద్ రెసిడెంట్ గా పనిచేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధి మరియూ దౌత్యవేత్త జేమ్స్ అకిలెస్ కిర్క్‌ప్యాట్రిక్. ఈయన పేరుమీదే ఈ ప్రాంతం జేమ్స్ స్ట్రీట్ గా పివబడేది. అయితే తారువాత కాలంలో దీనికి మహాత్మాగాంధీ రోడ్డుగా నామకరణం చేశారు. కానీ ఇప్పటికే జేమ్స్ స్ట్రీట్ పేరుతో రైల్వే స్టేషన్ అక్కడ కొనసాగుతోంది.

రాణి గంజ్… 1888లో క్వీన్ విక్టోరియా గౌరవార్థం ఏర్పాటు చేసిన ధాన్యం మార్కెట్ తరువాతి కలంలో ‘మహారాణి గంజ్’ అని వ్యవహరించేవారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఆటోమొబైల్ వ్యాపారం అభివృద్ధి చెందింది. రాణిగంజ్ గా ప్రసిద్దికెక్కింది.

అల్వాల్… తమిళ కవులైన ఆళ్వారుల పేరు మీద ఈ ప్రాంతం ఏర్పడింది. మహావిష్ణువుని స్తుతిస్తూ శ్లోకాలు పాడుతూ తమిళ ఆళ్వారులు ఈ ప్రాంతం మీదుగా ప్రయాణస్తూ ఇక్కడ కొంత కాలం గడపడంతో ఈ ప్రాంతానికి ఆళ్వార్ అని పేరు వచ్చింది. కాలక్రమంలో అది ఆల్వాల్ గా మారి స్ధిరపడింది.

లాల్ బజార్… ఈ ప్రాంతం బ్రిటీష్ సైన్యానికి షాపింగ్ మార్కెట్ గా ఉండేది.  బ్రిటిష్ సైనికుల యూనిఫాంలో భాగమైన ‘రెడ్ జాకెట్’ నుండి లాల్ బజార్ అనే పేరు వచ్చింది.

మల్కాజిగిరి… మల్లికార్జున స్వామికి అంకితం చేయబడిన దేవాలయం తర్వాత దీనిని గతంలో మల్లికార్జున గిరి అని పిలిచేవారు. కాలక్రమంలో మల్కాజిగిరిగా మారింది.

గన్ రాక్… తిరుగుబాటు దారులను అడ్డుకునేందుకు ఈ ప్రాంతంలో ఒక ఎత్తైన కొండ మీద తుపాకీలతో పహారా కాసేవారు. తుపాకీని ఉంచిన కొండ అనే అర్ధంతో ఈ ప్రాంతాన్ని గన్ రాక్ అని పిలిచేశారు. అదే పేరు ఇప్పటికీ కొనసాగుతోంది

లాలాగూడ… ఈ ప్రాంతంలో ఆంగ్లో ఇండియన్లు ఎక్కువగా నివసించే వారు. లిటిల్ ఇంగ్లాండ్ అని కూడా పిలవబడే ఈ ప్రాంతలో ఎర్రగా ఉండే ఆంగ్లో ఇండియన్లు ఈ ప్రాంతంలో అధికంగా ఉండేవారు కాబట్టి లాలాగూడ అనే పేరు ఈ ప్రాంతానికి స్ధిరపడింది. అదే పేరు ఇప్పటికీ కొనసాగుతోంది.

తార్నాక… నిజాం కాలంలో ఈ ప్రాంతంలో ఒక నవాడు మామిడి తోట ఉండేది. తోటలో పండ్లను కాపాడుకోవడానికి అతను పొలానికి తారుతో ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. అటుగా వెళ్ళే పౌరులను తనిఖీ చేయ్యడానికి ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పటు చేశారు. ఈ చెక్ పోస్ట్ ను ఉర్దూలో నాకా అంటారు తారుతో కంచెవేసిన ప్రాంతం వెరసి తార్నాక నేరు నానుడిలోకి వచ్చింది.

హబ్సిగూడ… నిజాం వ్యక్తిగత భద్రతా సిబ్బంది అయిన హబ్షీలు ఈ ప్రాంతలో నివాసం ఉండేవారు. గతంలో అబిస్సీనియాగా పిలవబడి ప్రస్తుతం ఇదియోపియా పేరు మార్చుకున్న దేశంలో హబ్షిస్ గ్రామం నుంచి ఈ హబ్షీలు నిజాం భద్రత కోసం వచ్చి ఈ ప్రాంతంలో స్ధిరపడ్డారు. అందుకు ఈ ప్రాంతానికి హబ్సిగూడ అని పేరు వచ్చింది.

ఎస్ రావు నగర్… ఈసీఐఎల్ గా పిలవబడే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్ధాపకు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ అయ్యగారి సాంబశివరావు గౌరవార్ధం ఈ ప్రాంతానికి ఆ పేరు పెట్టారు. తన సింప్లిసిటీకి పేరుగాంచిన డాక్టర్ రావు 80 ఏళ్ల తర్వాత కూడా సీటు కోసం ప్రయత్నించకుండా సిటీ బస్సుల్లో ప్రయాణించేవారు.

మౌలా అలీ… మౌలా అలీ అంటే ’నా ప్రభువు అలీ‘ అని అర్ధం.  ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఆస్థానంలో యాకుత్ అనే ఒక నపుంసకుడు ఉండేవాడు. యాకుత్ అనారోగ్యంతో ఉన్నప్పుడు తన కలలో అలీ ఇబ్న్ అబీ తాలిబ్ (అకా అలీ, హజ్రత్ అలీ) ఒక కొండపై కూర్చొని తన చేతిని ఒక రాయిపై ఆనించాడు. మరుసటి రోజు ఉదయం యాకుత్ అనారోగ్యం నయమైంది. యాకుత్ తనకు కలలో కనిపించిన కొండను సందర్శించినప్పుడు అక్కడ అలీ చేతి గుర్తులు ఉన్న రాయి కనిపించింది. దీంతో యాకుత్ మౌలా అలీ అని  బిగ్గరగా అరిచాడని చెపుతారు. అతని అరుపే ఆ ప్రాంతానికి పేరుగా స్ధిరపడింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com