ఇవాళ ఉదయం ములుగు కేంద్రంగా చోటు చేసుకున్న భూకంపం కారణంగా రెండు తెలుగు రాష్ద్రాల్లో భూమి కంపించింది. కొద్ది సెకనుల పాటు జనం భయాందోళనకు గురయ్యారు. ఉదయం 7.27 గంటల సమయంలో ఈ ప్రకంపనలు వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు నిర్థారిస్తున్నాయి.
అయితే, భూ ప్రపకంపనల ధాటికి ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఓ ఇంటి గోడ కూలిపోయింది. ఏటూరు నాగారం మండలం రొయ్యూరులో రేకుల ఇంటి గోడ కూలిపోయింది. అయితే, అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు. దీంతో ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.