పండగలు–పర్వదినాలు…
––––––––––––––––––
11, ఆదివారం, వైష్ణవ నృసింహ జయంతి, నిజకర్తరి ప్రారంభం.
12, సోమవారం, మహ వైశాఖి, బుద్ధపూర్ణిమ.
16, శుక్రవారం, సంకటహర చతుర్ధి.
––––––––––––––––––
మేషం… (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఎంతటి కఠినమైన వ్యవహారాన్నైనా అలసట, జాప్యం లేకుండా పూర్తి చేస్తారు. మీపై సన్నిహితులు ఉంచిన బాధ్యతలు సైతం పూర్తి చేస్తారు. సుదూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఉద్యోగయత్నాలు సానుకూలమై నిరుద్యోగులు సంతోషంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మరింత దష్టి సారిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడవచ్చు. కొత్త కాంట్రాక్టులు సైతం దక్కుతాయి.ఇంతకాలం పడిన కష్టాలు తీరే సమయం. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా మొదట్లో కొంత ఇబ్బందిగా ఉన్నా క్రమేపీ రెండుమూడు విధాలుగా ధనప్రాప్తి కలుగుతుంది. అవసరాలకు ఏ మాత్రం లోటులేకుండా గడుస్తుంది. భూములు, షేర్ల విక్రయాలు అనుకూలించి అనూహ్యంగా సొమ్ము సమకూరుతుంది. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులను ఆకట్టుకుంటాయి. మిమ్మల్ని వ్యతిరేకించిన వారు సైతం మద్దతుగా నిలుస్తారు. వివాహాది వేడుకలతో సందడిగా ఉంటుంది. సంతానపరమైన సమస్యలు తీరతాయి. ఆరోగ్యం .కొంత ఇబ్బందికరంగా ఉన్నా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో కొత్త ఆలోచనలు, ప్రతిపాదనలతో భాగస్వాములను మెప్పించి ముందుకు సాగుతారు. విస్తరణ కార్యక్రమాలు మరింత ముమ్మరం చేస్తారు. లాభాలకు కొదవ ఉండదు. ఉద్యోగాలలో మరిన్ని విజయాలు సాధిస్తారు. మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వైద్యులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఊహించని సన్మానాలు, పురస్కారాలు అందుతాయి. 14,15 తేదీల్లో ఆకస్మికప్రయాణాలు. ఒప్పందాలు రద్దుచేసుకుంటారు. బంధువులతో తగాదాలు. దత్తాత్రేయ పూజలు చేయండి.
వృషభం… (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)
రానురాను పరిస్థితులు మీకే అనుకూలిస్తాయి. మిత్రులు సంపూర్ణంగా సహకరిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారడం విశేషంగా చెప్పవచ్చు. నూతన ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంతకాలం పడిన కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. భవిష్యత్తుపై విద్యార్థులకు మరింత భరోసా కలుగుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగినా సర్దుబాటు కాగలదు. రుణబాధలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన రీతిలో అవసరాలకు తగినంతగా సొమ్ము సమకూరుతుంది. ఆస్తుల విక్రయాలు జరిగి కొంత లబ్ధి పొందుతారు. మొత్తం మీద ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగానే ఉంటుంది. మీ అంచనాలు, ఊహలకు తగిన విధంగా కుటుంబసభ్యులు సహకరిస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అందరి మన్ననలు పొందుతారు. వివాహాది శుభకార్యాల నిర్వహణలో పాలుపంచుకుంటారు. సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వైద్యసేవలకు స్వస్తి చెబుతారు. వ్యాపారాలు అనుకున్న రీతిలో విస్తరిస్తారు. పెట్టుబడులు మరింత సమకూరి ముందుకు సాగుతారు. లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు ఎదురైనా నైపుణ్యంతో అధిగమిస్తారు. పైస్థాయి వారి నుంచి తగినంత ప్రోత్సాహం అందుతుంది. క్రీడాకారులు, రాజకీయ,పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. 16,17 తేదీల్లో మానసికఆందోళన. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మిథునం… (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు).
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. కాంట్రాక్టులు భారీగా పొందుతారు. విచిత్ర సంఘటనలు ఆకట్టుకుంటాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. విద్యార్థులు, నిరుద్యోగులు ప్రతిభ చాటుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. రావలసిన సొమ్ము అందుతుంది. ఆస్తుల విక్రయాలు పూర్తయి సొమ్ము సమకూరుతుంది. పొదుపు చర్యల ద్వారా కూడా డబ్బు అందుకుంటారు. రుణబాధల నుంచి బయటపడతారు. కుటుంబసభ్యుల ఆదరణ చూరగొంటారు. కొన్ని సమస్యల నుంచి అత్యంత నేర్పుగా బయటపడి ప్రశంసలు పొందుతారు. మీ నిర్ణయాలను అంతా ప్రశంసిస్తారు. కొంత నలత చేసినా ఉపశమనం పొందుతారు. వ్యాపారులు మరింత లాభాలు పొందుతారు. కొత్త భాగస్వాముల రాకతో కళకళలాడుతూ ముందుకు సాగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా గడుస్తుంది. నూతనంగా విధులు చేపడతారు. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు. సాంకేతికవర్గాలు, రాజకీయవేత్తలు, కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. 15,16 తేదీల్లో పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు తప్పవు. దూరప్రయాణాలు చేస్తారు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం… (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష).
పనులు చకచకా సాగుతాయి. మీ సామర్థ్యం, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థుల అంచనాలు పసిగట్టి తదనుగుణంగా ముందుకు సాగుతారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. తీర్థయాత్రలు చే స్తారు. కొంత సొమ్ము ఊహించని విధంగా లభిస్తుంది. పెండింగ్బాకీలు, షేర్ల విక్రయాల ద్వారా మరింత సొమ్ము సమకూరుతుంది. మొత్తం మీద డబ్బుకు కొదవలేకుండా గడుస్తుంది. మీ అంచనాలకు తగినట్లుగా కుటుంబసభ్యులు వ్యవహరిస్తారు. అందరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఆరోగ్యపరంగా కొంత మెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. నూతన పెట్టుబడులు సైతం అందుతాయి. విస్తరణ కార్యక్రమాలు మరింత ముమ్మరం చేస్తారు. ఉద్యోగులు నూతన బాధ్యతలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. కోరుకున్న పదోన్నతులు రావచ్చు. అలాగే, విధి నిర్వహణలో తగిన గుర్తింపు రాగలదు. కళాకారులు, రాజకీయవేత్తలు, పరిశోధకులకు విశేష ఆదరణ. సత్కారాలు జరుగుతాయి. 11,12 తేదీల్లో కుటుంబసభ్యులతో వైరం. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సివస్తుంది. రాబడి నిరుత్సాహపరుస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
సింహం… (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ముఖ్యమైన కార్యక్రమాలు కష్టమైనా లెక్కచేయకుండా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో పలుకుబడి, గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహకరిస్తారు. వాహన, గృహయోగాలు కలిగే సూచనలు. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఎటువంటి సమస్య ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుని ముందడుగు వేస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. సొమ్ముకు లోటు లేకుండానే గడుస్తుంది. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. భూవిక్రయాలు అనుకూలించి మరింత సొమ్ము సమకూర్చుకుంటారు. వేడుకల నిర్వహణకు కొంత సొమ్ము వెచ్చిస్తారు. మొత్తం మీద ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడతారు. కుటుంబసభ్యులు మీపట్ల మరింత సానుకూల వైఖరితో ఉంటారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొద్దిపాటి రుగ్మతలు తప్పకపోవచ్చు. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. నూతన పెట్టుబడులకు తగిన సమయం. భాగస్వాములతో వివాదాలు తీరతాయి. లాభాల బాటలో నడుస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. సహచరుల సాయం సంపూర్ణంగా అందుతుంది. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే కాగలదు. 13,14 తేదీల్లో దూరప్రయాణాలు. ఆదాయానికి మించి ఖర్చులు. అనుకున్నది సాధించడంలో ఆటంకాలు. ఈశ్వరారాధన మంచిది.
కన్య… (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
మిత్రులతో వివాదాలు నెలకొని కొంత నిరుత్సాహం చెందుతారు. ఆస్తుల విషయంలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొనవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండక చేసే పనిపై ఏకాగ్రత లోపిస్తుంది. కష్టపడ్డా ఫలితం అంతగా లేక డీలా పడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మరింత చురుగ్గా పాల్గొంటారు. మీ సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం ఉత్తమం. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ముఖ్యమైన కార్యక్రమాలు చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు. ఒక వ్యక్తి పరిచయమై మీకు కొంత ఉపకరిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఏదోవిధంగా సర్దుబాటు కాగలవు. రుణబాధలు తొలగుతాయి. ఆస్తుల విక్రయాలు జరిగినా డబ్బు అందక నిరాశ చెందుతారు. మొత్తం మీద ఖర్చులు తగ్గించుకునేందుకు యత్నిస్తారు. కుటుంబంలో కొన్ని అభాండాలు మోయడానికి సిద్ధంగా ఉండండి. ఆదరించిన, ప్రేమించిన వారే విమర్శలు గుప్పిస్తారు. సోదరులు, సోదరీలతో అకారణంగా తగాదాలు. మీ ఆలోచనలతో కుటుంబసభ్యులు విభేదిస్తారు. జలుబు వంటి రుగ్మతలు బాధించవచ్చు. వైద్యసేవలు పొందుతారు. వ్యాపారాల విస్తరణ యత్నాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు. నూతన పెట్టుబడులు ఆలస్యమవుతాయి. భాగస్వాముల సలహాలు తిరస్కరిస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు తథ్యం. విధుల్లో గందరగోళ పరిస్థితి తప్పకపోవచ్చు. వైద్యులు, రాజకీయవేత్తలు, కళాకారులకు కొన్ని అవకాశాలు చేజారవచ్చు. 11,12 తేదీల్లో ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యవహారాల్లో విజయంసాధిస్తారు. లక్ష్మీ నృసింహస్తోత్రాలు పఠించండి.
తుల… (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కొన్ని వ్యవహారాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. తరచూ తీర్థయాత్రలు సాగిస్తారు. దూరప్రాంతాల నుంచి ముఖ్య విషయాలు తెలుస్తాయి. ఆస్తుల వ్యవహారాలలో కొంతకాలంగా జరుగుతున్న వివాదాలు పరిష్కారదశకు చేరే సూచనలు. భవిష్యత్తుపై నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. రావలసిన డబ్బుకు లోటు రాదు. రుణబాధలు నుంచి విముక్తి. ఆస్తుల విక్రయాలు, పొదుపు చర్యల అనూహ్యంగా సొమ్ము సమకూరుతుంది. మొత్తం మీద అవసరాలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా గడుస్తుంది. బంధువులతో సఖ్యంగా మెలుగుతారు. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. పెద్దల ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. వ్యాపారాలలో కొంత మేరకు లాభాలు గడిస్తారు, పెట్టుబడులకు లోటు లేకుండా ఉంటుంది. భాగస్వాములు సైతం మీదారికే వస్తారు. ఉద్యోగులు. విధి నిర్వహణలోనూ మీ సత్తా చాటుకుంటారు. ప్రమోషన్లు దక్కవచ్చు. సాంకేతిక వర్గాలు,పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. 16,17 తేదీల్లో ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. పనుల్లో అవరోధాలు. ఇంటాబయటా విమర్శలు పెరుగుతాయి. గురుదత్త స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం… (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఒక సమాచారంతో ఊపిరిపీల్చుకుంటారు. సంఘంలో విశేష అతిథి మర్యాదలు పొందుతారు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు, సమస్యలు తీరతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ప్రముఖులు పరిచయమై చేయూతనిస్తారు. కొత్త కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. ఇంటి నిర్మాణాలకు సమాయత్తమవుతారు. విద్యార్థులు కోరుకున్న కోర్సులు దక్కించుకుంటారు. సొమ్ముకు ఏమాత్రం లోటు రాదు. ఎడాపెడా సొమ్ము అందుతునే ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు చాలావరకు తీరతాయి. ఇన్సూరె¯Œ ్స, చిట్ఫండ్వంటి వాటి ద్వారా కొంత సొమ్ము సమకూరుతుంది. కుటుంబంలో అందరి ప్రేమను పొందుతారు. కొన్ని విషయాలలో మీకు మీరే సాటి అనిపించుకుంటారు. మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. సంతానం వివాహాది విషయాలు కొలిక్కి తెస్తారు. దూరపు బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తుల విషయంలో సోదరులతో ఒక ఒప్పందానికి వస్తారు. గతం నుంచి ఎదురవుతూ వస్తున్న ఆరోగ్య సమస్యలు తీరతాయి. మరింత మెరుగైన జీవనం సాగిస్తారు. వ్యాపారాలు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. నూతన పెట్టుబడులు అందుకుంటారు. భాగస్వాముల నిర్ణయాలు మీకే ఉపకరిస్తాయి. ఉద్యోగులకు కోరుకున్న చోటుకు బదిలీలు ఉండవచ్చు. అలాగే, విధి నిర్వహణలో మీకు ఎదురులేని పరిస్థితి. పారిశ్రామికవేత్తలు, సాంకేతికవర్గాలు, కళాకారులకు అనూహ్యమైన విజయాలు. 13,14 తేదీల్లో మానసిక అశాంతి. బంధువులతో విరోధాలు. పనులు నత్తనడకన సాగుతాయి. శివపంచాక్షరి పఠించండి.
ధనుస్సు… (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
అనూహ్య పరిణామాలను ఆసక్తిగా గమనించి ముందుకు సాగుతారు. ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు చాలావరకూ పరిష్కరించుకుంటారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుని సత్తా చాటుకుంటారు. ఊహించని రీతిలో సొమ్ము సమకూరుతుంది. రెండుమూడు విధాలుగా ధనలాభం. ఆస్తుల విక్రయాలు పూర్తయి ఆ డబ్బు కూడా సమకూరుతుంది. మొత్తం మీద గతం కంటే పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబసభ్యులు మీపై మరింత నమ్మకాన్ని పెంచుకుంటారు. సమర్థత, చాకచక్యంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. మీ నిర్ణయాల కోసం అంతా ఎదురుచూస్తున్నా తొందరపడకుండా మసలుకుంటారు. కొంత నలత చేసినా ఉపశమనం లభిస్తుంది. అంతగా వైద్యసేవలు అవసరం ఉండవు. వ్యాపారాలు నూతన పెట్టుబడులు, భాగస్వాములతో కళకళలాడుతుంటాయి. రావలసిన లాభాలు అందుకుంటారు. విస్తరణలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో ఎటువంటి అవరోధమైనా పట్టుదలతో అధిగమిస్తారు. విధులలో భారం తగ్గుతుంది. ప్రమోషన్లకు అవకాశాలున్నాయి. పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలకు పట్టింది బంగారమే. 15,16 తేదీల్లో శ్రమాధిక్యం తప్పదు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆదిత్య హృదయం పఠించండి.
మకరం… (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
వీరికి అన్నింటా విజయాలే. ఏ కార్యక్రమం చేపట్టినా ఎదురుండదు. వెనువెంటనే పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. నూతన ఉద్యోగాలు దక్కవచ్చు. ఒక మరపురాని సంఘటన ఎదురుకావచ్చు. గతంలో మిమ్మల్ని వదిలివెళ్లిన ఒక వ్యక్తి తిరిగి చెంతకు చేరతారు. సొమ్ముకు లోటు రాదు. అవసరాలకు మించి ధనప్రాప్తి. షేర్ల విక్రయాలు మరింత లాభించి ఉత్సాహం చెందుతారు. ఖర్చులకు వెనుకాడరు. మొత్తం మీద ఆర్థికంగా పుంజుకున్నట్టే. కుటుంబంలోని వారికి మీరే ముఖ్య అతిథిగా మారతారు. వివాహాది శుభకార్యాలు సైతం నిర్వహిస్తారు. బంధువుల రాక మరింత సంతోషం కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య ఎడబాటు, వివాదాలు తొలగుతాయి. కొంత నలత చేసినా సర్దుబాటు కాగలదు. అలాగే, కుటుంబంలోని ఒకరి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపుతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాల వైపు సాగుతారు. పెట్టుబడులు సమకూరతాయి. కొత్త భాగస్వాములు జతకడతారు. విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీపై వచ్చిన ఆరోపణలు తొలగుతాయి. సచ్ఛీలురుగా బయటపడి సత్తా చాటుకుంటారు. కొత్త విధులు చేపడతారు. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులు తమ నైపుణ్యతను చాటుకుంటారు. 16,17 తేదీల్లో శ్రమ పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యపరంగా చికాకులు. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించండి.
కుంభం… (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. చేపట్టిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, మిత్రులు శుభవర్తమానాలు అందిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఊరటనిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గతం గుర్తుకు వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణబాధలు చాలావరకూ తీరతాయి. ఆకస్మిక ధనలాభాలు కలిగి ఆశ్చర్యపోతారు. మీరు మర్చిపోయిన బాకీలు సైతం అందుతాయి. మొత్తం మీద అవసరాలకు లోటు రాకుండా గడుస్తుంది. కుటుంబంలో అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. మీమాటే శిరోధార్యంగా భావిస్తారు. మీరు అనుసరించే విధానాలను అందరూ సమర్థిస్తారు. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. అలాగే, పెద్దల ఆరోగ్యంపై ఆందోళన తొలగుతుంది. వ్యాపారాలలో. క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొని లాభాలు గడిస్తారు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగ విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. పైస్థాయి వారి చేయూత అందుతుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, కళాకారులకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. 12,13 తేదీల్లో రాబడి మందగించి అప్పులుచేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నరాల సంబంధిత రుగ్మతలు. గణేశాష్టకం పఠించండి.
మీనం… (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి).
అనుకున్న కార్యక్రమాలను కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన లేఖ ద్వారా కీలక విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. మీ వ్యూహాలను అమలు చేసి కొన్ని విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు ఆశించిన ఉపాధి అవకాశాలు పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. కొన్ని పెండింగ్బాకీలు వసూలవుతాయి. డబ్బుకు లోటు లేకుండా గడుస్తుంది. ఖర్చులు మీదపడినా లెక్కచేయరు. షేర్ల విక్రయాల ద్వారా మరింత సొమ్ము సమకూరుతుంది. చేతినిండా సొమ్ముతో వారమంతా ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వివాహాయత్నాలు సానుకూలం కావడం విశేషం. ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది. వైద్యసేవలు విరమిస్తారు. వ్యాపారులకు లాభాలు మరింత దక్కుతాయి. నూతన పెట్టుబడులకు తగిన సమయం. భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగ విధి నిర్వహణ ప్రోత్సాహకరంగా సాగుతుంది. సహచరులతో వివాదాలు సర్దుకుంటాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. 14,15 తేదీల్లో ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు.సన్నిహితులతో మాటపడతారు. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.