24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

కుమారుడి హత్యకు తండ్రి సుపారి

కామారెడ్డిలో కుమారుడి హత్యకు తండ్రి సుపారి ఇస్తే… రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నంలో సోదరిని తోబుట్టువే బలి తీసుకున్నాడు.

డబ్బుల కోసం కుటుంబసభ్యులను వేధిస్తుండటంతో తల్లిదండ్రులు విసిగిపోయారు. డబ్బుల కోసం తల్లిదండ్రులను చితకబాదటం పరిపాటిగా మారింది. దీంతో కుమారుడు రాజు హత్యకు తండ్రి సాయిలు సుఫారి ఇచ్చాడు. అనీల్ అనే వ్యక్తితో  లక్షకు ఒప్పందం చేసుకుని కుమారున్ని హత్య చేయించాడు. కామారెడ్డి శివారులోని ఉగ్రవాయి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

గత నెల 29న రాజు హత్య జరగగా… విచారణలో కామారెడ్డి రూరల్ పోలీసులు అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.  తండ్రి సాయిలు, సుఫారి తీసుకున్న వ్యక్తి అనిల్ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.

మరోవైపు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో రాయపోల్ గ్రామంలో కులాంతర వివాహం చేసుకున్న పాపానికి అక్క నాగమణిని అన్న పరమేష్ హత్య చేశాడు. అక్క నాగమణి రాయపోలు గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తిని నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నందుకు అన్న ఈ దారుణానికి ఒడిగట్టాడు.

రాయపోలు నుంచి మన్యగుడ రహదారిపై స్కూటి పై వెళుతున్న కానిస్టేబుల్‌ నాగమణిని ముందుగా కారుతో ఢీకొట్టి.. కత్తితో  పొడిచి చంపాడు. మృతురాలు నాగమణి స్వస్థలం రాయపోలుగా కాగా… హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో  కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. కులాంతర వివాహం చేసుకున్నందుకే చంపినట్టు పరమేష్ పోలీసుల వద్ద వెల్లడించాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com