28.7 C
Hyderabad
Wednesday, August 12, 2026

Live Video

spot_img

పుష్ప 2 పై హైకోర్ట్ సీరియస్…

పుష్ప 2 సినిమా యూనిట్ పై హైకోర్ట్ ఈ రోజు సీరియస్ అయింది. పుష్ప 2 బెనిఫిట్ షో ఎవరి బెనిఫిట్ కోసం అంటూ వాదించిన పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి. బెనిఫిట్ షో ద్వారా వచ్చిన డబ్బులు ఎస్క్రో అకౌంట్ లో పెట్టాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అధిక మొత్తంలో టికెట్ చార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలని ప్రముఖ జర్నలిస్టు సతీష్ కమల్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఇందుకు రెండు వారాలు సమయం కావాలని మైత్రి మూవీ మేకర్స్ న్యాయవాది సిద్దార్థ్ కోరారు. రెండు వారాలు అంటే సినిమా బెనిఫిట్ షో, సినిమా రిలీజ్ అయిపోతుందని వాదించిన శ్రీనివాస్ రెడ్డి, 800 రూపాయలతో సామాన్యుడు ఎలా సినిమా చూస్తాడు అంటూ సినీ నిర్మాతను కోర్ట్ ప్రశ్నించింది. ఓ కుటుంబం నుండి 10 మంది సినిమాకు వెళ్తే 10 వేలు ఖర్చు పెట్టలా అని కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

సాయంత్రం ఆర్డర్ ఇస్తానంటూ తెలిపిన జస్టీస్ విజయ్ సేన్ రెడీ బెంచ్

బెనిఫిట్ షో అర్ధ రాత్రి 1 గంటలకు పెట్టడం ఎంటి, చిన్న పిల్లల ఆరోగ్యం దెబ్బ తింటుందని న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి చివరి నిమిషంలో సినిమా రిలీజ్ ను ఆపలేమని, తదుపరి విచారణను మరో రెండు వారాలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పూస్పా 2 మూవీపై మరో పిటిషన్ వేసిన శ్రీశైలం. సినిమాలో సమాజ హితం లేదని … తప్పు దారి పట్టించేలా ఉందని న్యాయస్థానానికి వివరించారు. కోర్టు సమయం వృధా చేయొద్దని లక్ష రూపాయల జరిమానా వేసిన హైకోర్టు రిట్ పిటిషన్ కొట్టివేసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com