ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కీలక దశకు చేరుకుంది. సొరంగాల్లో సహాయక చర్యలపై అనుభవం ఉన్న ప్రత్యేక బృందాలను, మెరికల్లాంటి జవాన్లను కూడా రప్పించారు. మూడు రోజులుగా శ్రమిస్తోన్న ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన, అలాగే, మార్కోస్ టీమ్‌లు ఎట్టకేలకు కాసేపటి క్రితం ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయి. ఎనిమిది మంది కార్మికులు చిక్కుకు పోయారని అంచనా వేస్తున్న ప్రాంతానికి రెస్క్యూ టీమ్‌లు చేరుకున్నాయి. లోపల చిక్కుకున్న కార్మికులను పేర్లు పెట్టి పిలుస్తూ.. శబ్దాలు చేస్తూ ముందుకు కదులు తున్నారు. ఈ క్రమంలోనే బురద, మట్టి, ఊట నీరును బయటకు తోడేస్తున్నారు. ఓవైపు వీటిని బయటకు తోడేస్తూనే.. మరోవైపు నెమ్మదిగా ముందుకు వెళ్తున్నారు. చివరకు కార్మికులు చిక్కుకు పోయిన 14వ కిలోమీటర్‌కు కొన్ని మీటర్ల దూరంలోనే రెస్క్యూ బృందాలు అన్వేషిస్తున్నాయి.
ఆ సహాయక చర్యలకు సంబంధించిన టన్నెల్ లోపలి దృశ్యాలు, బయటి నుంచి పంపిస్తున్న సహాయక సామాగ్రి దృశ్యాలు ఇప్పుడు చూద్దాం…