26.8 C
Hyderabad
Wednesday, September 16, 2026

Live Video

spot_img

టీడీపీకి జీవీరెడ్డి షాక్

తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యండిల్‌లో ప్రకటించారు. తాను ఇక ఏ రాజకీయ పార్టీలో చేరబోనని లాయర్‌గా తన వృత్తిని కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు. ఫైబర్‌ నెట్ చైర్మన్‌గా ఆయన కొద్ది కాలం కిందటే బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఫైబర్ నెట్‌లో పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. 410 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లుగా కూడా ప్రకటించారు.

వారం రోజుల క్రితం ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేరుగా ఫైబర్‌నెట్ ఎండీ, ఐఏఎస్ దినేష్‌పై ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను బయటకు రాకుండా కాపాడుతున్నారని మండిపడ్డారు. 410 మంది ఉద్యోగుల్ని తీసేయమని చెప్పినా ఇంకా జీతాలిస్తున్నారని.. ఆ డబ్బుల్ని దినేష్ దగ్గర నుంచి వసూలు చేయాలన్నారు. దినేష్ పేషీలో పని చేస్తున్న ముగ్గురు అధికారుల్ని విధుల్నించి తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. ఫైబర్ నెట్‌ను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. జీవీ రెడ్డి చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఆయన చేసిన ఆరోపణలపై ఐఏఎస్ అధికారుల సంఘం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో, సంబంధిత శాఖకు మంత్రి అయిన బీసీ జనార్ధన్ రెడ్డి ఈ వ్యవహారంపై ఆటు ఫైబర్ నెట్ ఎండీ దినేష్‌తో పాటు ఇటు ఆరోపణలు చేసిన ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డిని పిలిచి మాట్లాడారు. జీవీ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని అడిగినట్లుగా తెలుస్తోంది. ఆయన తన వద్ద ఉన్న సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇంతలో ఏమయిందో కానీ.. జీవీ రెడ్డి హఠాత్తుగా రాజీనామా చేశారు. గతంలో వైసీపీలో పని చేసిన జీవీరెడ్డి.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఆయనకు మంచి వాగ్దాటి ఉండటంతో అధికార ప్రతినిది హోదా ఇచ్చారు. టీవీ చర్చల్లో ధాటిగా టీడీపీని సమర్థించేవారు. వైసీపీ తీరును ఎండగట్టే వారు. జీవీ రెడ్డి వ్యవహారంపై టీడీపీ క్యాడర్‌లో సానుభూతి ఉంది. ఆయనకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

దినేష్ రెడ్డి బదిలీ :

టీడీపీకి జీవీ రెడ్డి రాజీనామా చేయడంతో ప్రభుత్వం స్పందించింది. వెంటనే ఏపీ ఫైబర్ నెట్ ఎండీ దినేష్‌ను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఐఏఎస్ దినేష్ ఫైబర్ నెంట్ ఎండీతో పాటు ఆర్టీజీఎస్, గ్యాస్, డ్రోన్ కార్పొరేషన్ల బాధ్యతలు కూడా చూస్తున్నారు. అన్ని బాధ్యతల నుంచి ఆయనను ప్రభుత్వం తప్పించింది. జీఏడీకి రిపోర్టు చేయమని ఆదేశించింది. అంటే ఆయనకు పోస్టింగ్ లేదని అర్థం . గ్రూప్‌2 వివాదం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మరో వివాదం చెలరేగింది. ఫైబర్‌ నెట్‌లో జరుగుతున్న లుకలుకలు తారా స్థాయికి చేరాయి. ఏపీ ఫైబర్ నెట్‌లో ఉన్న ఉన్నతాధికారులు మాట వినడం లేదని ఆ సంస్థ ఛైర్మన్‌ జీవీ రెడ్డి ఆరోపించారు. నాడు టీడీపీని, కూటమి పార్టీలను తిట్టిన వారందరికీ నేడు కూడా జీతాలు ఇస్తున్నారని వాపోయారు. అలాంటి వారిని కొనసాగించడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. నాడు వైసీపీలో పెత్తనం చెలాయించిన వారే ఇప్పుడు కూడా సంస్థలో ఉన్నత స్థాయిలో ఉన్నందునే ఇలాంటివి జరుగుతున్నాయని ఆయన ఓపెన్ గాని చెప్పారు. ప్రెస్‌మీట్ పెట్టి ఇలా ఓపెన్‌గా అధికారులను తిట్టడం వైరల్‌గా మారింది. దీనికి టీడీపీ కార్యకర్తలు కూడా వంత పాడారు. అయితే ప్రభుత్వ పెద్దలు దీని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. ఈ వివాదంలో అసలేం జరిగిందో కానీ.. మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. జీవీరెడ్డితో రాజీనామా చేయించడంతో ఆయన పార్టీ కి కూడా రాజీనామా చేశారు. ఫైబర్ నెట్ వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. జీవీ రెడ్డి చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పలు అక్రమాలను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. వైసీపీ హయాంలో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టించేందుకు చేసిన ప్రయత్నాలకు సంబంధించి ఫైళ్లను కూడా బయటకు తీసి.. పలు ఆరోపణలు చేశారు. అయితే ఎక్కడ గ్యాప్ వచ్చిందో కానీ.. దినేష్ కుమార్ తో ఆయనకు సరిపడలేదు. దాంతో వివాదం ప్రారంభమయింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com