ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. శుక్రవారం నుంచి జూన్ 2వ తేద వరకు బదిలీలకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఒకే ప్రాంతంలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. పదోన్నతి పొందిన వారైనా ఐదేళ్లు అదే చోట ఉంటే బదిలీ వర్తిస్తుంది. ఐదేళ్ల లోపు వున్న ఉద్యోగులకి వారి వ్యక్తిగత విన్నపాల మేరకు బదిలీ చేసేందుకు అవకాశం ఉంది. మే 31, 2026 లోపు రిటైర్మెంట్ అయ్యే వారు మాత్రం మినహాయింపునకు అర్హులు. అంధులు, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులు, మెడికల్ గ్రౌండ్స్, వితంతువులు, ట్రైబల్ ఏరియాల్లో రెండు సంవత్సరాలు పైగా పని చేసినవారు, అలాగే, స్పౌజ్ ఉద్యోగుల బదిలీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
- Advertisement with us -