32.5 C
Hyderabad
Wednesday, June 17, 2026

Live Video

spot_img

హర్యానా మాజీ సీయం చౌతాలా మృతి

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా (89) శుక్రవారం మృతి చెందారు. హర్యానాకు నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చౌతాలా మాజీ ఉప ప్రధాని చౌదరి దేవీలాల్ కుమారుడు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న 2000 సంవత్సరంలో 3,206 మంది జూనియర్ ఉపాధ్యాయుల నియామకం విషయంలో అక్రమనియామకాలని నిర్ధారణ కావడంతో చౌతాలా ఆయన కుమారుడు అజయ్ చౌతాలిద్దరినీ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో కోర్టు చౌతాలకు పదేళ్లు జైలు శిక్ష విధించగా 2013లో జైలుకు వెళ్లారు. కరోనా సమయలో జైళ్ళ రద్దీ తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం శిక్షా కాలంలో ఆరు నెలల రెమిషన్ ఇవ్వడంతో చౌతాలా జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం గురుగ్రామ్ లో నివసిస్తున్న ఓంప్రకాష్ చౌతాలా శుక్రవారం ఉదయం తన నివాసంలో మృతి చెందారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com