- టెక్సాస్ నుంచి బయల్దేరిన విమానం
- సి-17 మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో 205 మంది
- సింగిట్ టాయిలెట్.. నో వెంటిలేషన్
- యుద్ధ నేరస్థులు, ఖైదీలను తరలించిన తీరులో..
- భారత్ కూడా సర్టిఫై చేశాకే వెనక్కి
- మొత్తం 1800 మందిని గుర్తించిన ఇరుదేశాలు
- ప్రపంచంలో ఎక్కడున్నా వెనక్కు తీసుకుంటామన్న భారత్
- అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలకు పదను
- మోడీ టూర్ మరో వారంలో ఉండగా తరలింపు ప్రక్రియ
అమెరికాలో ఉంటున్న భారతీయ అక్రమ వలసదారులను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నట్టుగానే వెనక్కు పంపుతున్నారు. కానీ అందుకు వినియోగిస్తున్న విమానాలపై విమర్శలు పెరుగుతున్నాయి. రక్ణణ సర్వీసులకు వాడే మిలటరీ విమానాల్లో కనీస సదుపాయాలు లేని, వెలుతురు లేని చిన్న విమానం ,అదీ ఒకే టాయిలెట్ ఉన్న విమానంలో వందల మందిని తరలించడమేంటనే విమర్శలు పెరుగుతున్నాయి.అయితే ఇలా పంపుతున్నవారందరినీ పూర్తిగా భారతీయ అధికారుల సమక్షంలో పత్రాలను పూర్తిగా పరిశీలించి అనర్హులుగా తేల్చిన తర్వాతే విమానాలు ఎక్కిస్తున్నారు.
టెక్సాస్ నుంచి సీ-17 విమానంలో
ఆరు గంటల క్రితం టెక్సాస్ లోని అమెరికన్ మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ విమానం ద్వారా 205 మంది అక్రమ భారతీయ వలస దారులను వెనక్కు పంపారు.అక్రమ వలసదారులను తిప్పి పంపే పరంపరలో ఇది తొలి విమానం. అమెరికా మిలటరీకి చెందిన సీ-17 విమానంలో తొలివిడతలో కొందరు వెనక్కు మళ్లుతున్నారు.యుద్ధ నేరస్థులను విమానంలో తరలించిన విధంగా ఒకే వెంటి లేషన్ ఉన్న ఈ మిలటరీ విమానం సాధారంగా మిలటరీ సేవలకు వినియోగించేది.దీనిలో ఒకే ఒక్క టాయిలెట్ ఉంటుంది.205 మంది ప్రయాణీకులను ఒకే టాయిలెట్ ఉన్న విమానంలో ఎక్కించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరో వారంలో మోడీ పర్యటన
అక్రమ వలసదారుల విషయంలో కఠినాతి కఠినంగా ఉన్న ట్రంప్ ఇప్పటికే హోండురాస్, గ్వాటెమాలా,పెరూ దేశాల వలస దారులను ఇలాంటి విమానాల్లోనే కుక్కి వెనక్కి పంపారు. వచ్చే వారం మోడీ అమెరికా పర్యటన ఉన్న తరుణంలో అమెరికా తొలి విడత భారతీయులను ఇలా నిర్దాక్షిణ్యంగా వెనక్కు పంపడం సంచలనంగా మారింది.
ట్రంప్ అమెరికా పగ్గాలు రెండో సారి స్వీకరించాక చాలా కఠినాతికఠినంగా తయారయ్యారు.అమెరికాలో ఉంటున్న భారతీయ అక్రమ వలసదారులను వెనక్కు తీసుకునేందుకు తాము సుముఖమేనని అయితే చట్టబద్ధంగానే వారిని వెనక్కు పంపాలని విదేశాంగ మంత్రి జయశంకర్ గతంలోనే కోరారు. అక్రమ వలసదారులను ఇలా మిలటరీ విమానాల్లో వెనక్కు పంపడం చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు డోనాల్డ్ ట్రంప్.భారతీయ అక్రమ వలసదారుల విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకుంటుందని మోడీ కూడా ట్రంప్ కు హామీ ఇచ్చారు. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం అమెరికా, భారత్ కలసి 18,000 లమంది ఇమ్మిగ్రంట్లను గుర్తించినట్లు నిర్ధారించాయి.అక్రమ వలసలకు భారత్ కూడా వ్యతిరేకమే. ఎందుకంటే వ్యవస్థీకృత నేరాలు వీటి వల్ల పెరిగే అవకాశముంది.
ఎక్కడున్నా వెనక్కు తీసుకుంటాం
భారతీయులు అమెరికా అనే కాదు మరే దేశంలోనైనా చట్టబద్ధంగా నివసిస్తుంటే, ఆధార పత్రాలతో సహా తమకు పంపితే వెరిఫై చేసుకుని వారిని వెనక్కు తీసుకుంటామని భారత్ గతంలోనే ప్రకటించింది.
ఇమ్మిగ్రేషన్ చట్టాలకు పదను
అమెరికా అక్రమంగా దేశంలోకి చొరబడిన వారిని వెనక్కు పంపి సరిహద్దులు పటిష్టం చేసుకుంటోంది. ఇమ్మిగ్రేషన్ చట్టాలకు పదును పెడుతోంది. ఈ చర్యల వల్ల అడ్డదారుల్లో దేశంలోకి చొరబడటం సరికాదని, అది రిస్కుతో కూడుకున్నదని అందరికీ తెలసివస్తుందని భారత్ లో అమెరికా ఎంబసీ ప్రతినిధి కామెంట్ చేశారు.