మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు జరుగుతున్నాయని ఈ విషయంలో మా పార్టీ అధిష్టానందే తుది నిర్ణయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఏఐసీసీ అగ్రనేతలు మల్లిఖార్జునఖర్గే, రాహుల్ గాంధీలతో భేటీ అయిన అనంతరం మీడియాతో రేవంత్‌రెడ్డి చిట్‌ఛాట్ చేశారు. నాకూ రాహుల్ గాంధీకి మధ్య ఎటువంటి గ్యాఫ్ లేదని, ఇద్దరి మధ్య సాన్నిహిత్యంలో అలాగే ఉందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇదంతా బీఆర్‌ఎస్ ప్రచారమని అన్ని విషయాలు ఎప్పటికప్పుడు ఫోన్లో మేమిద్దరం చర్చించుకుంటామని తెలిపారు. మేము నిర్వహించిన కుల గనణపై రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రస్తావించారని సీయం గుర్తుచేశారు. తెలంగాణలో కుల గణన పక్కాగా చేశామని త్వరలో దానికి చట్టం కూడా తీసుకువస్తామన్నా రేవంత్ మా సర్వేలో బీసీలు ఐదు శాతం పెరిగారని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ అంశంపై అధిష్టానంతో చర్చలు జరుగుతున్నాయని నేనుగా ఎవరి పేరు సిఫారసు చేయనని అన్నారు. అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు మంత్రులవుతారన్నారు. ప్రస్తుతం మేము ఇచ్చిన హామీలపైనే ఫోకస్ పెట్టామని, ప్రతిపక్ష నేతలపై ఉన్న కేసుల విషయంలో చట్టప్రకారమే వెళతామన్నారు. ఈ ఫార్ములా రేసు స్కామ్‌లో ఆ కంపెనీకి నోటీసులు ఇచ్చామని, స్పందించడానికి కొంత వ్యవధి అడిగారని వారి నుంచి సమాధానం వచ్చిన తరువాత ఆ కేసులో తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అక్రమాలపై జస్టిస్ లోకూర్ కమీషన్ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ పరిశీలనలో ఉందని ఆయన అభిప్రాయం వెల్లడైన తరువాత ఆకేసులో ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకుంటామని సీయం రేవంత్‌రెడ్డి చెప్పారు. పీసీసీ కార్యవర్గం కూర్పు ఓ కొలిక్కి వచ్చిదని ఒకట్రెండు రోజుల్లో ప్రకటన ఉంటుందన్నారు.
శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సంస్ధగత ప్రధానకార్యదర్శి కేసీ.వేణుగోపాల్‌తో సీయం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్, పిసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లు వేరు వేరుగా సమావేశం అయ్యారు. పీసీసీ కార్యవర్గం ఏర్పాటు, క్యాబినేట్ విస్తరణలపై కేసీ వీరి ముగ్గురి నుంచి వేరు వేరుగా అభిప్రాయాలు సేకరించారు. ఏఐసీసీ రెండు రోజుల్లో పిసీసీ కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి నలుగురు వర్కింగ్ ప్రెసిండెంట్లను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లే అని తెలుస్తోంది. కుల గణన, ఎస్సీ వర్గీకరణలపై త్వరలో సూర్యాపేట, గజ్వేల్‌లలో సభలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.