36.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

ఎక్స్‌ప్రెస్‌వేపై ఫైటర్ జెట్స్ ల్యాండింగ్..

IAF యుద్ధానికి సిద్ధమవుతుందా?

ఉత్తర ప్రదేశ్‌లోని గంగా ఎక్స్ ప్రెస్ వే ఇప్పుడు IAFకు కేరాఫ్‌గా మారింది. పహెల్‌గామ్ ఉగ్రదాడుల తర్వాత ఇప్పటికే ఆక్రమణ్‌ పేరుతో యుద్ధ విన్యాసాలు చేపట్టిన ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌.. ఇప్పుడు గంగా ఎక్స్‌ప్రెస్‌ వేపై ల్యాండ్ అండ్ గో డ్రిల్స్‌ను నిర్వహించింది. ఇప్పటికే భారత్-పాక్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాల సమయంలో ఈ డ్రిల్స్ చేపట్టడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

యుద్ధం ప్రారంభమైతే ఏ విధంగా ఎటాక్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై IAF ఫోకస్ చేసింది. అందుకే రఫెల్, మిగ్-29, మిరాజ్-2000, సుఖోయ్ ఫైటర్ జెట్స్‌ ఈ డ్రిల్స్‌లో పాల్గొన్నాయి. కేవలం ఫైటర్ జెట్స్‌ మాత్రమే కాదు.. ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ అయిన సీ-130జే, ఏఎన్-32 విమానాలు, ఎంఐ17 వీ5 హెలికాప్టర్లను కూడా ఈ హైవేపై పరీక్షించారు. డే అండ్ నైట్‌ ఈ డ్రిల్స్‌ కొనసాగాయి.

అత్యవసర సమయంలో ఈ హైవేను ఉపయోగించుకునేలా నిర్మించారు. 3.5 కిలోమీటర్ల పొడవు గల ఈ ఎయిర్‌స్ట్రిప్ రాత్రి సమయంలో కూడా ఫైటర్‌ జెట్‌ల ల్యాండింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. యూపీలో ఇప్పుడు మొత్తం నాలుగు ఎక్స్‌ప్రెస్‌వేలు ఫైటర్ జెట్స్‌ ల్యాండింగ్‌లకు అందుబాటులో ఉన్నాయి. షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్‌ స్ట్రిప్‌ మాత్రమే రాత్రివేళల్లో ఫైటర్‌ జెట్‌లను ల్యాండ్‌ చేసుకోవచ్చు.ఇప్పటికే ఈ ఎక్స్‌ప్రెస్‌ వే ఇరుపక్కల 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

ప్రస్తుత ఉద్రిక్త సమయంలో ఈ డ్రిల్స్ నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పాలి. ఈ ప్రాంతం నేపాల్ సరిహద్దు నుంచి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైనది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com