భారత్‌పై డ్రోన్ దాడులకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్‌కు ప్రకృతి షాక్ ఇచ్చింది. మే 9వ తేదీ శుక్రవారం అర్థరాత్రి 1:44 గంటలకు పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
ఈ ప్రకంపనలు ముఖ్యంగా బలూచిస్తాన్ రాష్ట్రంలోని క్వెట్టా ప్రాంతంలో నమోదయ్యాయి. ఆకస్మికంగా భూమి కంపించడంతో ప్రజలు గజగజలాడిపోయారు. భయంతో రాత్రి సమయంలో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం లేదు. అయితే బెలుచిస్తాన్ ప్రాంతం కూడా పాకిస్తాన్ నుంచి స్వతంత్రం కోరుకుంటూ ఆందోళనలు ముమ్మరం చేశారు. ఓ పక్క భారత్ పాకిస్తాన్ మిసైళ్ళను తిప్పి కొడుతుంటే మరో పక్క బెలుచిస్తాన్ పాక్ సైన్యాన్ని, యుద్ద శకటాలను బాంబులతో పేల్చివేస్తోంది.
ఇదిలా ఉండగా, ఇటీవల భారతదేశం ఆపరేషన్ సిందూర్ కింద పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదుల స్థావరాలపై టార్గెట్ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నుంచి పాకిస్తాన్ తరచూ డ్రోన్ల ద్వారా భారత సరిహద్దుల్లో కవ్వించే చర్యలకు పాల్పడుతోంది. అయితే, భారత భద్రతా బలగాలు ఈ ప్రయత్నాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి.