29.4 C
Hyderabad
Tuesday, September 15, 2026

Live Video

spot_img

విజయవాడలో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన డీపీఆర్ కోసం సలహా సంస్థల నుంచి దరఖాస్తులు కోరింది. గన్నవరం నుండి పీఎన్‌బీఎస్ వరకు మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఈ డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే విజయవాడలో ట్రాఫిక్ రద్దీ తగ్గిస్తుందని భావిస్తున్నారు. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు సంబంధించి డీపీఆర్  తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్  టెండర్లు ఆహ్వానించింది.

నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి ఫ్లైఓవర్‌ను నిర్మించనుంది. ఈ నెల 14 వరకు బిడ్లు దాఖలు చేయడానికి గడువు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 3.30 గంటలకు బిడ్లు తెరుస్తారు. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం జనరల్ కన్సల్టెంట్‌ను ఎంపిక చేయడానికి కూడా టెండర్ పిలిచారు. విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో 38.40 కి.మీ మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదం కోసం పంపించారు. మొదటి కారిడార్ గన్నవరం నుండి పీఎన్‌బీఎస్ వరకు, రెండవ కారిడార్ పెనమలూరు నుండి పీఎన్‌బీఎస్ వరకు నిర్మిస్తారు. ఈ మేరకు విజయవాడలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి జాతీయ రహదారుల సంస్థ  మహానాడు కూడలి నుంచి నిడమానూరు వరకు భారీ ఫ్లైఓవర్ నిర్మించాలని ఆలోచన చేస్తోంది. ఇదే మార్గంలో రామవరప్పాడు నుంచి నిడమానూరు వరకు మెట్రో రైలు కూడా వెళ్లనుంది.

దీని కోసం రెండు వేర్వేరు బ్రిడ్జిలు నిర్మిస్తే ఎక్కువ ఖర్చవుతుందని.. ఉమ్మడిగా 4.7 కి.మీ పొడవునా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించారు. అప్పుడు పైన మెట్రో రైలుకు, కింద వాహనాలు వెళ్లడానికి ఇబ్బందులు ఉండవు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి అయ్యే ఖర్చులు భరిస్తాయి. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ డీపీఆర్ తయారీ కోసం బిడ్లను ఆహ్వానించారు. ఎంపికైన సలహా సంస్థ డీపీఆర్ తయారు చేస్తుంది. APMRCL కార్యకలాపాల కోసం జనరల్ కన్సల్టెంట్‌ను ఎంపిక చేయడానికి టెండర్ పిలిచారు. ఎంపికైన సలహా సంస్థ నాలుగేళ్ల పాటు సేవలు అందిస్తుంది. దీని కోసం రూ.205 కోట్లతో బిడ్లు పిలిచారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు బిడ్లు దాఖలు చేయడానికి అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం 3.30 గంటలకు బిడ్లను తెరుస్తారు.. ప్రీబిడ్ సమావేశాన్ని 12న నిర్వహిస్తారు. అటు విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు పనుల్ని కూడా వేగవంతం చేశారు.. ఈ మేరకు బిడ్ల వరకు ముందడుగు పడింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com