35.2 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

బెంగళూరు బస్సుల్లో రాయితీ

తెలంగాణ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు రాష్ట్ర ఆర్టీసీ శుభవార్త చెప్పింది. బెంగళూరు మార్గంలో టికెట్ ధరలో 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. కర్ణాటక రాజధాని బెంగళూరు రూట్‌లో నడిచే అన్ని రకాల బస్సు సర్వీసుల్లోనూ రానుపోనూ ఈ రాయితీ వర్తిస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ ఇస్తున్న ఈ డిస్కౌంట్ వల్ల ఒక్కో ప్రయాణికుడికి రూ.100 నుంచి రూ.160 వరకు ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ రూట్‌లో టికెట్ల ముందస్తు రిజర్వేషన్ కోసం ఆర్టీసీ వెబ్ సైట్‌ని http://tgsrtcbus.in సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.

టికెట్ ధరలు పాతవి, కొత్తవి…
  • ఏసీ స్లీపర్ బస్సులో బెర్త్ అయితే ప్రస్తుతం రూ.1569, డిస్కౌంట్ టికెట్ ధర రూ.1412
  • ఏసీ స్లీపర్ సీటర్ అయితే ప్రస్తుతం రూ.1203, డిస్కౌంట్ టికెట్ ధర రూ.1083
  • రాజధాని బస్సుల్లో ప్రస్తుతం రూ.1203, డిస్కౌంట్ టికెట్ ధర రూ.1083
  • NAC స్లీపర్ బెర్త్ అయితే ప్రస్తుతం రూ.1160, డిస్కౌంట్ టికెట్ ధర రూ.1044
  • NAC సీటర్ టికెట్ ధర ప్రస్తుతం రూ.951 అయితే, డిస్కౌంట్ ధర రూ.856
  • సూపర్ లగ్జరీ టికెట్ ప్రస్తుత ధర రూ.946 అయితే, డిస్కౌంట్ ధర రూ.851
Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com