39.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

వైరాలో హాస్టల్‌ ఆకస్మిక తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం

  • విద్యార్థినీలతో ప్రత్యేకంగా సమావేశం

  • భోజనం చేసిన డిప్యూటీ సీఎం

  • బోధన తీరు, వసతులు, మెస్ నిర్వహణ, మెనూ మెయింటెనెన్స్‌ ఆరా

  • విద్యార్థినీలతో ముచ్చటించిన డిప్యూటీ సీఎం

ఎలా ఉన్నారు? బాగా చదువుకుంటున్నారా? పెద్దయ్యాక ఏం అవుదాం అనుకుంటున్నారు? మీ భోజనం బాగుంటుందా? భోజనం చేద్దామా? మెనూ ఫ్లెక్సీ ఎక్కడ పెట్టారు?
వైరా గర్ల్స్ రెసిడెన్షియల్ విద్యార్థినీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
వైరా గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగా పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి

ఆదివారం భద్రాచల శ్రీ సీతారామస్వామి కళ్యాణానికి హాజరై తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6 గంటల సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకస్మికంగా వైరా మండల కేంద్రంలోని మహిళా రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించారు. మొదట విద్యార్థినిల అందరితో స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సుమారు 500 మంది విద్యార్థినీలతో వారు సమావేశం అయ్యారు. రాత్రివేళ హాస్టల్లో డ్యూటీలో ఎవరు ఉంటారు? వారు ఎక్కడ పడుకుంటారు? డిన్నర్ టైమింగ్స్ ఏంటి? ఇప్పుడు భోజనం చేద్దామా? హాస్టల్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అంటూ విద్యార్థినీల నుంచి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇంటర్ వరకు ఉంది కదా? రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి? ఇంటర్ పూర్తి చేసిన వారు ఎటువైపు వెళుతున్నారు? మెడిసిన్ వైపు ఎంతమంది వెళ్లారు? ఇంజనీరింగ్ సైడ్ ఎంత మంది వెళ్లారు అని సిబ్బందిని ప్రశ్నించారు.
ఈ సంవత్సరం నలుగురు మెడిసిన్ కు ఎంపికైనట్టు సిబ్బంది వివరించారు. మిగిలినవారు ఇంజనీరింగ్ వైపు వెళ్లినట్టు తెలిపారు. మీ కళాశాల నుంచి బయటికి వెళ్లిన విద్యార్థుల వివరాలు నమోదు చేస్తున్నారా? విద్యార్థినిల సంఖ్యకు అనుగుణంగా క్లాస్ రూమ్స్ ఉన్నాయా? ప్రతి క్లాస్కు ఎన్ని సెక్షన్లు ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు.

ఆ తర్వాత ఎవరైనా మాట్లాడుతారా అంటూ, విద్యార్థినిలను ఒక్కొక్కరుగా పిలిచి వారు భవిష్యత్తులో ఏ వృత్తిలో స్థిరపడాలనుకుంటున్నారు. వారి తరగతి. తల్లిదండ్రుల వివరాలను, వారి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

నా పేరు ప్రణవి, నేను ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్లో సౌకర్యాలు అన్ని బాగున్నాయి, భోజనం బాగుంది. ఇటీవల ఏకతా భారత్, శ్రేష్టభారత్ కార్యక్రమం నిర్వహించాము.

డిప్యూటీ సీఎం:  ఏం అవుదాం అనుకుంటున్నావ్?
ప్రణవి: కలెక్టర్
డిప్యూటీ సీఎం: ఎందుకు?

ప్రణవి:  అందరికీ సహాయం చేసే అవకాశం ఉంటుందని

ఇక్కడ టీచింగ్, ఫుడ్ బాగుంది, సంతోషంగా ఉంది అని ఎనిమిదో తరగతికి చెందిన దివ్య వివరించారు.
డిప్యూటీ సీఎం: పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావ్
దివ్య: డాక్టర్
డిప్యూటీ సీఎం: ఎందుకు
దివ్య: పేదలందరికీ ఉచితంగా వైద్య సహాయం చేయాలని

ఇక్కడ వాటర్ , ఫుడ్డు, టీచింగ్ అన్ని బాగుంటాయి. హౌస్ టీచర్ విజిత బాగా చూసుకుంటున్నారు అని 8వ తరగతి చెందిన ప్రవళిక వివరించారు.

డిప్యూటీ సీఎం: పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావ్
ప్రవళిక : డాక్టర్
డిప్యూటీ సీఎం: ఎందుకు
ప్రవళిక :  పేదవారికి సాయం చేసే అవకాశం ఉంటుందని

నా పేరు జోష్ణ , ఏడవ తరగతి చదువుతున్నాను
మా స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ బాగున్నాయి. ఎస్సే రైటింగ్ లో పాల్గొన్నాను. మా స్కూల్లో స్పోకెన్ ఇంగ్లీష్ స్పెషల్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు.

డిప్యూటీ సీఎం: పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావ్
జోష్ణ: పోలీస్ ఎస్ఐ
డిప్యూటీ సీఎం: ఎందుకు
జోష్ణ: సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాను.

విద్యార్థినీలతో భోజనం చేసిన డిప్యూటీ సీఎం :

విద్యార్థినీలతో పాఠశాల ఆవరణలో ప్రత్యేకంగా సమావేశం అయిన తర్వాత. డిన్నర్ రెడీగా ఉందా? అంతా కలిసి భోజనం చేద్దాం, పదండి అంటూ పిల్లలను వెంటపెట్టుకొని డిప్యూటీ సీఎం భోజనం చేశారు.

మెనూ పాటిస్తున్నారా? భోజనాల్లో నాణ్యత ఎలా ఉంటుంది. ఈరోజు మెనూ ఏమిటి? మీకు తెలుసా? మెనూ పాటిస్తున్నారా అంటూ విద్యార్థినీలను ప్రశ్నించారు. భోజనం నాణ్యత బాగుంటుంది, మెనూ పాటిస్తున్నారంటూ విద్యార్థిని సమాధానం ఇచ్చారు.

మెనూ ఫ్లెక్సీ ఎక్కడ పెట్టారు అంటూ ఆరా తీసి, ఫ్లెక్సీ దగ్గరకు వెళ్లి మెనూ చార్ట్ ను పరిశీలించారు. వసతులు, ఇబ్బందుల గురించి టీచింగ్ స్టాఫ్ ను అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది స్టాఫ్ ఉండాలి? ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు ఆకులను అడిగి తెలుసుకున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com