36.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

రాష్ట్రంలో రాక్షస పాలన – వైఎస్‌.జగన్‌

రాష్ట్రంలో పాలన చూస్తే ఎవరికైనా మనం రాక్షస పాలనలో ఉన్నామని ఇట్టే అర్ధం అవుతుందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్మోహనరెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన పిఠాపురం, మార్కాపురం, కదిరి, కుప్పం నియోజవకర్గాల నాయకులు, ఎంపీటీసీలు, జడ్‌పీటీసీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపాలిటీ, మండలాల ఉప ఎన్నికల్లో టీడీపీ గూండాల దాడిని ఎదుర్కొని నిలబడ్డ వైసీపీ నేతలను ఈ సందర్భంగా వైఎస్‌.జగన్‌ అభినందించారు. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాక్షస పాలన నడుస్తున్న ఇలాంటి సమయంలో తెగువ చూపి, నిబద్దతతో నిలబడి విలువలకు పెద్దపీట వేసినందుకు జగన్‌ అందరినీ ప్రశంసించారు. మన రాజకీయాలకు, చంద్రబాబు రాజకీయాలకు చాలా తేడా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు రాజకీయ ప్రస్తానం వెన్నుపోటుతో మొదలుపెట్టి ఆ తర్వాత అధికారం దక్కించుకోవడానికి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని జగన్‌ విమర్శించారు. సత్యసాయి జిల్లా గాండ్లపెంట ఎంపీపీ కానీ, ప్రకాశం జిల్లా మార్కాపురం ఎంపీపీ విషయంలో కానీ టీడీపీ ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా తెగువ చూపించి పార్టీ పక్షాన నిలబడ్డారని కొనియాడారు. పిఠాపుంరంలో కూడా మన వైసీపీ ఎంపీటీసీలు గట్టిగా నిలబడ్డారన్నారు. కుప్పం మున్సిపాటిటీ విషయానికి వస్తే వైసీపీ కౌన్సిలర్లను బెదిరించి ఒక్కో క్కరికీ 50 లక్షలు ఇచ్చి తమవైపుకు తిప్పుకున్నారని ఆరోపించారు. ప్రలోభాలకు, పోలీసుల దౌర్జన్యాలకు నిదర్శనం కుప్పం నియోజకవర్గమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాక ముందు ప్రతి ఇంట్లో అందరికీ నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్ళేవని, చంద్రబాబు సీయం అయ్యాక నోటి దగ్గర కంచాన్ని లాగేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మన హయాంలో ఇచ్చిన అన్ని పధకాలు అటకెక్కించేసిందని అన్నారు. ఇంతకు ముందు మన హయాంలో కార్యకర్తల కోసం మనం సరిగా చేయలేకపోయాం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్‌ వచ్చింది సమయమంతా ప్రజల ఆరోగ్యం మీదనే పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు కార్యకర్తలు పడుతున్న కష్టాలు నేను చూస్తున్నాను మీ అందరికీ మాట ఇస్తున్నా వచ్చే జగన్‌ 2.oలో మీ అందరికీ పెద్దపీట వేస్తా అని వైఎస్‌.జగన్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత, మార్కపురం వైసీపీ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు, కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ కేఆర్జె.భరత్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com