- మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
- పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ఆధిక్యం
- కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అతీషిలు వెనుకంజ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యింది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. పోస్ట్ బ్యాలెట్ ఓట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు వెనకంజలో ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో న్యూఢిల్లీ అసెంబ్లీ స్ధానం నుంచి ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. అలాగే మద్యం సిండికేట్ల స్కామ్లో నెలల తరబడి తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆప్ ముఖ్య నాయకుడు మనీష్ సిసోడియా జంగ్పూరా నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. న్యూఢిల్లీ స్ధానంలో కేజ్రీవాల్పై బీజేపీ అభ్యర్ధి పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నారు. ఇక కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అతీషి వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి తనయుడు కాంగ్రెస్ అభ్యర్ధి సందీప్ దీక్షిత్ తూర్పుఢిల్లీ నియోజకవర్గంలో వెనుకబడి ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ప్రాధమికంగా అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ 10, ఆప్ 6, కాంగ్రెస్ ఒక స్ధానంలో ఆధిక్యంలో ఉన్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నకల కౌంటిగ్ కోసం మొత్తం 19 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది.