ప్లేస్ మారుతుంది కానీ.. SRH ఫేట్ మాత్రం మారడం లేదు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి ఓడింది హైదరాబాద్. ఈ ఓటమితో వరుసగా నాలుగుసార్లు ఓడినట్టైంది SRH. మొత్తం ఆలౌరౌండ్ ప్రదర్శనతో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కేవలం 152 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత ఆ గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేయలేక చెత్తులేత్తేసింది. దీంతో ఏకంగా 7 వికెట్ల తేడాతో గెలిచింది గుజరాత్.
మొదట బ్యాటింగ్‌కు దిగిన SRH సొంత గడ్డపై భారీ స్కోర్ చేస్తుందనుకుంటే.. మరోసారి ఓపెనర్లు నిరాశపరిచారు. అభిషేక్, హెడ్ భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఇషాన్ కూడా కేవలం 17 పరుగులు మాత్రమే చేశాడు. నితీష్ రెడ్డి చేసిన 31 పరుగులే హైఎస్ట్ స్కోర్ అని చెప్పాలి. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది.
సిరాజ్ మ్యాజిక్ :
ఈ మ్యాచ్‌లో సిరాజ్ బౌలింగ్ గురించి స్పెషల్‌గా చెప్పుకోవాలి. సిరాజ్ 4 ఓవర్లు వేసి.. కేవలం 17 పరుగులు చేసి.. ఏకంగా 4 వికెట్లు తీశాడు. ఓపెనర్లిద్దరిని పెవిలియన్‌కు పంపాడు సిరాజ్. తన అత్యద్భుతమైన బౌలింగ్‌తో SRH వెన్ను విరిచాడరనడంలో ఎలాంటి డౌట్ లేదు.
ఇక 153 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన GTకి కూడా ఆదిలోనే షాక్ తగిలింది.
సాయి సుదర్శన్‌ను 5 పరుగులకే ఔట్ చేశాడు షమీ ఇక ఆ తర్వాత కమిన్స్ బట్లర్‌ను డకౌట్ చేయడంతో మ్యాచ్ SRHకు ఫేవర్‌గా మారుతుందనుకున్నారు. కానీ వాషింగ్టన్ సుందర్, గిల్ సూపర్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టారు. గిల్ 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు వాషింగ్టన్ సుందర్ 29 బంతుల్లో 49 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక ఆఖర్లో రూథర్ ఫర్డ్ ఇన్నింగ్స్ హైలేట్ అని చెప్పాలి. ఆరు బౌండరీలు.. ఒక సిక్స్ బాది 16 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు. దీంతో మ్యాచ్ ముగిసింది.
వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవడంతో GT పాయింట్స్ టేబుల్‌లో సెకండ్ ప్లేస్‌కి రాగా.. SRH మాత్రం వరుస ఓటములతో ఆఖరికి చేరింది.