ప్రముఖ సింగర్ కల్పన స్వల్ప అస్వస్థతకు గురైంది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని నిజాంపేట వర్టెక్స్ ఫ్రీ విలేజ్ లో నివాసం ఉంటున్న ఆమె.. రెండు రోజుల నుంచి ఇంటి డోర్ తెరవక పోవడంతో చుట్టుపక్కల వారు అసోసియేషన్ వారికి సమాచారం ఇచ్చారు. వారు డొర్ తెరిచేందుకు ప్రయత్నించిగా డోర్ ఓపెన్ చేయలేదు.
వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి డోర్ ను పగల కొట్టి సింగర్ ను బైటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో అందర్ని షాకింగ్ కు గురిచేసేదిగా మారింది.
పోలీసులు చెన్నైలో ఉన్న భర్తకు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో సింగర్ కల్పన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సింగర్ కల్పనకు వెంటిలేటర్ పైన వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కల్పన ఆరోగ్యంపై ఆమె కుమార్తె దయ ప్రసాద్ ప్రకర్ ఈ రోజు వివరణ ఇచ్చారు. నిద్ర మాత్రలు కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్లే అస్వస్థతకు గురైందని కల్పన కుమార్తె వెల్లడించింది. ఒత్తిడి కారణంగా జరిగిందని, మీడియాలో వస్తున్న వార్తలు సరికాదని కల్పన కుమార్తె వివరణ ఇచ్చింది. తమ కుటుంబంలో ఎటువంటి వివాదం లేదని కల్పన కూతురు స్పష్టం చేసింది.