37.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

తెలంగాణ బడ్జెట్‌ సమగ్ర స్వరూపం

  • రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌

  • తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు

  • రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు

  • మూల వ్యయం రూ.36,504 కోట్లు

  • ఆరు గ్యారెంటీలకు అధిక ప్రాధాన్యం

  • హైదరాబాద్‌ నగరానికి ప్రాధాన్యం

  • ఫ్యూచర్‌ సిటీ, ఏఐ సిటీలకు నిధులు

  • రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేలా మెగా మాస్టర్‌ ప్లాన్‌ 2050

  • అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. రూ. 3,04,965 కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను రూపొందించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే తెలంగాణలో తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లుగా ఉంది. మూల వ్యయం రూ.36,504 కోట్లుగా ఉంది.

బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు తమను నమ్మి అధికారం కట్టబెట్టారని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నామని, గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పారు. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు. కొందరు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారని, ప్రభుత్వ ప్రతి చర్యనూ నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 2 పడక గదుల ఇళ్లు ఇస్తామని ప్రజలకు నిరాశ మిగిల్చిందని ఆరోపించారు.

ఇక, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్‌ ప్లాన్‌ 2050 రూపొందించామని భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పదేళ్లలో ట్రిలియన్‌ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. చైనా ప్లస్‌ వన్‌ వ్యూహంతో రాష్ట్రాన్ని గ్లోబల్‌ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రతి మండలంలో మహిళలతో రైస్‌ మిల్లులు, మినీ గోదాములు ఏర్పాటు చేస్తామని, ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్‌ మిల్లుల్లో మిల్లింగ్‌ చేయిస్తామని, ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసే బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తామని వెల్లడించారు. మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దెకు 600 బస్సులు కేటాయిస్తామని, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని మల్లు భట్టి విక్రమార్క తన బడ్జెట్‌ ప్రసంగంలో వ్యాఖ్యానించారు.

ఇక, నేటి బడ్జెట్‌లో కీలక రంగాలకు కేటాయింపులు వివరంగా చూద్దాం…

వివిధ శాఖలకు..

  • వ్యవసాయ శాఖకు – రూ.24,439 కోట్లు
  • పశుసంవర్ధక శాఖకు – రూ.1,674 కోట్లు
  • నీటిపారుదల శాఖకు- రూ.23,373 కోట్లు
  • అడవులు-పర్యావరణం – రూ.1,023 కోట్లు
  • విద్యుత్‌ శాఖకు – రూ.21,221 కోట్లు
  • వైద్యారోగ్య శాఖకు – రూ.12,393 కోట్లు
  • పౌర సరఫరాల శాఖ – రూ.5,734 కోట్లు
  • హోంశాఖ – రూ.10,188 కోట్లు
  • శాంతిభద్రతలు – రూ.10,188 కోట్లు
  • ఆర్‌ అడ్‌ బీ శాఖకు – రూ.5,907 కోట్లు
  • పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి – రూ.31,605 కోట్లు
  • పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ – రూ.17,677 కోట్లు
  • దేవాదాయ, ధర్మాదాయ శాఖ – రూ.190 కోట్లు
  • కార్మిక శాఖ – రూ.900 కోట్లు
  • విద్య – రూ.23,108 కోట్లు
  • ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు – రూ.11,600 కోట్లు
  • పారిశ్రామిక రంగం – రూ.3,525 కోట్లు
  • పర్యాటక రంగం – రూ.775 కోట్లు
  • చేనేత – రూ.371 కోట్లు,
  • ఐటీ – రూ.774 కోట్లు
  • సాంస్కృతిక రంగం – రూ.465 కోట్లు
  • క్రీడలు – రూ.465 కోట్లు
  • హైదరాబాద్ సిటీ డెవలప్‌మెంట్‌ – రూ.150 కోట్లు
  • ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి – రూ.100 కోట్లు

సంక్షేమం కోసం కేటాయింపులు ఇలా..

మహిళా, శిశు సంక్షేమానికి – రూ. 2,862 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.40,232 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ.17,169 కోట్లు
బీసీ సంక్షేమం – రూ.11,405 కోట్లు
మైనార్టీ సంక్షేమం – రూ.3,591 కోట్లు
గృహజ్యోతి, ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్‌ కోసం – రూ.3 వేల కోట్లు

ఆరు గ్యారెంటీలు – రూ.56,084 కోట్లు

రైతు భరోసా- రూ.18వేల కోట్లు
చేయూత పింఛన్లు – రూ.14,861 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు – రూ.12,571 కోట్లు
మహాలక్ష్మి పథకం – రూ.4,305 కోట్లు
గృహజ్యోతి- రూ.2,080 కోట్లు
సన్నాలకు బోనస్‌ – రూ.1,800 కోట్లు
గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ- రూ.723 కోట్లు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా- రూ.600 కోట్లు
రాజీవ్‌ ఆరోగ్యశ్రీ- రూ.1,143 కోట్లు
రాజీవ్‌ యువ వికాసం- రూ.6వేలకోట్లు
Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com