24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

నాని సమర్పణలో మెగాస్టార్ కొత్త సినిమా

మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమాని ప్రకటించారు. `దసరా` ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు.  నాని సమర్పణలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కొత్త సినిమా రాబోతోంది.

ఇప్పుడు బిగ్‌ స్టార్స్ సైతం యంగ్‌ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తూ కొత్త కథలను ఆడియెన్స్ కి అందిస్తున్నారు. కొత్త పంథా ఫాలో అవుతున్నారు. తాజాగా చిరంజీవి సినిమా ప్రకటనే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.

విశేషమేంటంటే ఈ మూవీకి నాని సమర్పకులుగా నిలవడం విశేషం. ఆయన కొత్త ప్రొడక్షన్‌ స్టార్ట్ చేశారు. యునానమస్‌ ప్రొడక్షన్‌ పతాకంపై ఈ మూవీకి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇది మెగాస్టార్‌ చేస్తున్న మోస్ట్ వాయిలెంట్‌ ఫిల్మ్ అని తెలిపింది టీమ్‌. ప్రస్తుతం నానితో ఓ మూవీ చేస్తున్నాడు శ్రీకాంత్‌. అనంతరం చిరంజీవి సినిమా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.

దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల తన సత్తా చాటుకున్నాడు. ఎంట్రీతోనే వంద కోట్లు కొల్లగొట్టేసి నానికి కెరీర్ లో బెస్ట్ మూవీని ఇచ్చాడు. ఇప్పుడు నానితోనే మళ్లీ శ్రీకాంత్ ఓదెల పారడైజ్ అనే మూవీని చేస్తున్నాడు. తన మూడో సినిమాగా డ్రీమ్ ప్రాజెక్ట్‌ను సెట్ చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో సినిమాను ఓకే చేయించుకున్నాడు శ్రీకాంత్ ఓదెల.

మెగాస్టార్ శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్‌ను తెలిపేలా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com