ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో చైనా దూసుకుపోతుంది. చైనా అతిపెద్ద సెర్చింజిన్ బైదూ రెండు కొత్త మోడళ్లను లాంచ్ చేసింది ERNIE 4.5, X1 అనే రెండు కొత్త రీజనింగ్ ఫోకస్డ్ మోడళ్లను తీసుకొచ్చినట్టు ప్రకటించింది. అద్భుతమైన మల్టీమోడల్ సామర్థ్యంతో ERNIE 4.5 మోడల్‌ను తీసుకొచ్చినట్లు బైదూ తెలిపింది. అత్యాధునికమైన లాంగ్వేజ్, ప్రతి విషయాన్ని అర్థం చేసుకొనే సత్తా, అద్భుతమైన మెమోరీ కలిగి ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈ మల్టీమోడల్ ఏఐ సిస్టమ్‌లు టెక్ట్స్, వీడియో, ఇమేజెస్, ఆడియోతో సహా వివిధ రకాల డేటాను ప్రాపెస్ చేయగలవు. ఎక్స్1 మోడల్‌కు సమర్థవంతమైన విషయాన్ని అవగాహన చేసుకొనే సత్తా, ప్రణాళికలు రచించే సామర్థ్యం కలిగి ఉంటుందని తెలిపింది. ఇది స్వయంప్రతిపత్తిగా ఉపయోగించే ఫస్ట్ డీప్ థింకింగ్ మోడళ్లలో ఒకటి అని బైదూ ప్రకటించింది.
ఇప్పటికే డీప్‌సీక్‌తో ప్రపంచాన్ని షేక్ చేసింది చైనా. అది వచ్చిన కొన్ని రోజులకే మనూస్ పూరిట మరో ఏఐను డెవలప్ చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నవాటి కంటే ధీటుగా పనిచేసేలా దీన్ని డిజైన్ చేసి డెవలప్ చేశారు. కొత్త వెబ్‌సైట్లను డిజైన్ చేయడం దగ్గరి నుంచి టూర్ ప్లానింగ్ చేయడం వరకు అన్నింటిని చక్కపెడుతుంది ఈ మనూస్. ఒక రకంగా చెప్పాలంటే తనకు తానుగా ఆలోచించుకునే ఓ జనరల్ ఏఐ ఏజెంట్. ఇదే అద్భుతం అనుకుంటే.. ఇప్పుడు మరో రెండు కొత్త మోడల్స్‌ను తీసుకొచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది చైనా.