31.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

మైనార్టీల సంక్షేమానికి ఆద్యుడు చంద్రబాబు – మంత్రి ఫరూక్‌

– గజినీ కంటే ఎక్కువ దోపిడీ చేసిన ఘనుడు జగన్
– ఐదేళ్ల దుర్మార్గపు పాలనలో ఏపీ సర్వనాశనం
– చంద్రబాబుకు మైనార్టీలందరూ అండగా నిలవాలి
– క్రిస్మస్ తేనేటి విందులో మైనార్టీ సంక్షేమ మంత్రి ఎన్ఎండి ఫరూక్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోని మైనార్టీల సంక్షేమానికి విప్లవాత్మక రీతిలో సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేసి మైనార్టీల సంక్షేమ ఆద్యుడిగా, మైనార్టీల సంక్షేమ పక్షపాతిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలిచారని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. సోమవారం విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ తేనేటి విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి క్రైస్తవ పీఠాధిపతులు, పాస్టర్లు, ఫాదర్లు, క్రైస్తవులు తేనేటి విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రసంగించారు. 2002 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ చర్చిల నిర్మాణానికి నిధులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని ప్రకటించిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. అప్పట్లో హైదరాబాదులో మైనార్టీ వర్గానికి చెందిన సిక్కులకు కూడా గురుద్వారా నిర్మించిన ప్రభుత్వం టిడిపి దేనిని అన్నారు. మైనార్టీ వర్గాలైన ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు తదితర వారందరి సంక్షేమానికి చంద్రబాబు నాయకత్వంలోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు ఎన్నో సంక్షేమ పథకాల అమలు చేశామని అన్నారు. విదేశీ విద్య, నైపుణ్య అభివృద్ధి పథకాలను మైనార్టీల ఆర్థిక పురోభివృద్ధికి, విద్యోన్నతికి అమలు చేసి మైనార్టీల సంక్షేమ పక్షపాతిగా చంద్రబాబు చేసిన కృషిని మంత్రి ఫరూక్ వివరించారు.

గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో గజినీ మహమ్మద్ కంటే ఎక్కువ దోపిడీ చేసిన ఘనుడు జగనేనని మంత్రి ఫరూక్ ఎద్దేవా చేశారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో కడపలో హజ్ భవనానికి రూ. 24 కోట్లు ఇచ్చి నిర్మాణం పూర్తి చేస్తే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా సొంత జిల్లాలో హజ్ భవనాన్ని ఐదేళ్లుగా జగన్ పట్టించుకోకపోవడంతో నేడు శిథిలావస్థకు చేరిందని ధ్వజమెత్తారు. ఇది గత ప్రభుత్వ దుర్మార్గపు పాలన కు నిదర్శనమని, సిగ్గుచేటని అన్నారు. టిడిపి ప్రభుత్వం 945 చర్చిల నిర్మాణానికి రూ. 70 కోట్లు ఖర్చు చేస్తే, గత ప్రభుత్వం కేవలం 84 చర్చలకు రూ.5 కోట్లు మాత్రం ఖర్చు చేసిందని అన్నారు. మౌజాన్లకు గౌరవ వేతనం ఇచ్చిన తరహాలోనే చర్చిల పాస్టర్లకు కూడా గౌరవ వేతనం ఇవ్వడం ప్రారంభించిన ఘనత చంద్రబాబు దేనిని అన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో షాదీ ముబారక్, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక లాంటి పథకాలను నిరుపేద కుటుంబాలకు అందజేయడం జరిగిందని గత ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. హజ్ యాత్రకు రాయితీపై ముస్లింలను ఏ విధంగా పంపడం జరిగిందో, అదే తరహాలో క్రైస్తవులను కూడా జెరూసలేముకు పంపిన ఘనత తమ ప్రభుత్వాన్ని దేనిని, గత ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందో క్రైస్తవ సోదరులు ఆలోచించాలని అన్నారు.రూ. పది లక్షల కోట్లు అప్పులోకి రాష్ట్రాన్ని గత ఐదేళ్లలో నెట్టారని, అప్పుకు వడ్డీ, అసలు కట్టేందుకు, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారని అన్నారు. తీవ్ర సంక్షోభం లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు, రాష్ట్రం బాగుపడేందుకు, ప్రజలు బాగుపడేందుకు మాలో, మీలో కూడా మార్పు రావాలని, పనిచేసే వారికి అండగా నిలబడాలని, నూతన సంవత్సరంలో నూతన వరవడితో ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం రూ 4300 కోట్లతో బడ్జెట్లో కేటాయించడం జరిగిందని అన్నారు. మైనార్టీలందరూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, ఇదే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని ఫరుక్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గతంలో 8700 మందికి పైగా పాస్టర్లకు టిడిపి ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని, త్వరలో నిలిచిపోయిన గౌరవ వేతనం చెల్లింపులను పునరుద్ధరించేందుకు బడ్జెట్లో పెట్టడం జరిగిందన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలో సుభిక్ష పాలన, రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి, ప్రభుత్వానికి, సంక్షేమ పథకాల అమలుకు క్రైస్తవులందరూ జీసస్ ను ప్రార్థించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని కోరారు

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com