దేశంలోని వివిధ బ్యాంకుల్లో వేల కోట్ల నగదు వివిధ రూపాల్లో పేరుకుపోయింది. మొత్తంగా బ్యాంకుల్లో ఉండిపోయిన డబ్బు.. ఎవరు తీసుకోవడానికి ముందుకు రాని డబ్బు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేల కోట్లు ఉన్నాయి. సంవత్సరాలుగా అందులోనే మూలుగుతున్నాయి. ఓ నివేదిక ప్రకారం చాలామంది డబ్బులను పొదుపు చేసి మర్చిపోవడంతో అవన్నీ ఇన్ ఆక్టివ్ మోడ్ లోకి వెళ్లిపోతాయి. దీనినే బ్యాంకింగ్ పరిభాషలో నిర్వహణ లేని సొమ్ము అని పిలుస్తారు. క్లెయిమ్ చేయని డబ్బు కొన్ని వేల కోట్ల వరకు ఉంటుందట. ఆ డబ్బు సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్, టర్మ్ డిపాజిట్లు, లైఫ్ ఇన్సూరెన్స్ వంటి పాలసీల్లో ఉందట. బ్యాంకు డిపాజిట్లలో 62,000 కోట్లు, స్టాక్స్ లో 25 వేల కోట్లు, మ్యూచువల్ ఫండ్స్ లో 35వేల కోట్లు, ఈపీఎఫ్ లో 48 వేల కోట్లు, ఇన్సూరెన్స్ లో 21,500 కోట్ల రూపాయల నగదు ఉందట. ఇదంతా కలిపి లక్ష కోట్లపై మాటే అని సమాచారం.
ఈ డబ్బును కేంద్రం తీసుకోవడానికి అవకాశం లేకపోవడంతో అలానే ఉండిపోతోంది. నిబంధనలు అందుకు అంగీకరించకపోవడంతో ఆ డబ్బు చాలా సంవత్సరాలుగా ఇన్ యాక్టివ్ మోడ్ లో ఉంటున్నదట. యాక్టివ్ మోడ్ లో ఉన్న డబ్బును ప్రభుత్వం తీసుకోవడానికి ఉండదు. నిబంధనలు కూడా అందుకు అంగీకరించవు. ఆ డబ్బును ఇతర మార్గాలకు మళ్లించే అవకాశం కూడా లేదు. ఆ సొమ్ము ఏం చేస్తారనేది ఇప్పటివరకు తెలియదు.
అయితే ఈ డబ్బు కనుక ప్రభుత్వం చేతికి వస్తే చాలావరకు అప్పు తీరుతుంది. ప్రస్తుతం మన దేశపు అప్పు లక్షల కోట్లను దాటింది. సంక్షేమ పథకాలకు ప్రభుత్వాలు పన్నుల ద్వారా వస్తున్న ఆదాయాన్ని మళ్లిస్తున్న నేపథ్యంలో కీలక రంగాలకు కేటాయింపులు లేకుండా పోయాయి. ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాలకు అప్పులు తేవాల్సి వస్తోంది. ఆ అప్పులను దీర్ఘకాలిక వడ్డీ కింద చేర్చి.. ప్రతి ఏడాది కిస్తీల మాదిరిగా చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వానికి ఇలా మూలుగుతున్న డబ్బు చేరితే అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టవచ్చు.
వివిధ మార్గాల ద్వారా దేశం తెచ్చిన అప్పును కొంతలో కొంత తీర్చవచ్చు. దానివల్ల ప్రభుత్వాలకు పన్నులు పెంచే అవకాశం ఉండదు. ధరలను పెంచే అవకాశం ఉండదు. పైగా పన్నులను తగ్గించవచ్చు. ధరల స్థిరీకరణపై కూడా సమగ్రమైన నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఈ డబ్బు కొన్ని సంవత్సరాలుగా అలానే ఆయా విభాగాలలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ డబ్బు గనుక ప్రభుత్వం తీసుకోవాలి అనుకుంటే నిబంధనలను సరళతరం చేయవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఇంత డబ్బు మూలుగుతున్న విషయం బయటకి తెలియడంతో జనాల్లో విస్తృతమైన చర్చ మొదలైంది.. ఆ డబ్బును బయటికి తీసుకొచ్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేస్తే దేశం బాగుపడుతుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.