24 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

ఏపీ బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోద ముద్ర

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌. అయితే, బడ్జెట్‌ సభలో ప్రవేశ పెట్టడానికి ముందు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేబినెట్‌ ఆమోదించింది. రూ.3.22లక్షల కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రతులను అందజేశారు. అనంతరం మంత్రులు బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు. అలాగే, శాసన మండలిలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు. ఇటు అసెంబ్లీలో పయ్యావుల కేశవ్‌ మెయిన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com