తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, BRS సోషల్ మీడియా ఇంచార్జ్ దిలీప్ కొణతంను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన దిలీప్ ను అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
ఆ తర్వాత ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య చికిత్సలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కాంగ్రెస్ సర్కారుపై, సీఎం రేవంత్ రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నందుకు ఈ ఏడాది సెప్టెంబర్ లో సైబర్ క్రైం పోలీసులు కొణతం దిలీప్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రేవంత్ రెడ్డి సర్కార్‌పై విష ప్రచారం చేస్తున్నారంటూ దిలీప్ పై పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఈ రోజు విచారణకు రమ్మని పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం.