బాలీవుడ్ హీరో సయిఫ్ అలీ ఖాన్ గారాల పట్టి సారా అలీఖాన్ కేదర్ నాథ్ సినిమాతో బాలీవుడ్ లో ఆరంగేట్రం చేసింది. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన చేసి ప్రక్షకులను మెప్పించింది. సోమవారం శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న సారా…”సారా కోసం సంవత్సరంలో మొదటి సోమవారం. జై భోలేనాథ్” అని సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది.
కేదార్‌నాథ్‌కి సినిమా చేసి ఆరు సంవత్సరాలైందని, కొన్నిసార్లు ఇది నిన్నటిలా అనిపిస్తుంది.. కొన్నిసార్లు ఇది జీవితకాలం మరచిపోలేని అనుభవం అనిపిస్తుందని సోషల్ మీడియాలో కామెంట్ చేసింది.
కేదర్ నాథ్ సినిమా చేసినప్పటి నుంచి సారా అలీఖాన్ ప్రవర్తనలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆ సినిమా తర్వాత హిందు పండగలు ఏవి వచ్చినా భక్తితో వేడుకలు చేసుకోవటం అలవాటుగా మారింది.
పటౌడీ ఫ్యామిలీకి చెందిన సారా షూటింగ్ సమయంలో చిన్నపిల్లలా ప్రవర్తిస్తుందని హీరోలు ఆటపట్టిస్తుంటారు. సినీ గ్లామర్ కన్నా నటనకు ప్రాధన్యత ఇస్తానని సారా అనేక సార్లు ప్రకటించింది.
బాలీవుడ్ తనకంటూ పేరు సంపాదించుకున్న సారా అలీఖాన్..స్కైఫోర్స్ హిందీ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.