27.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

కళ్లతోనే ఆకట్టుకునే భాగ్యశ్రీ బోర్సే

పూణే నగరానికి చెందిన భాగ్యశ్రీ బోర్సే  బాలీవుడ్ చిత్రం యారియాన్ 2తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. గత ఏడాది తెలుగు వారికి పరిచయమైన భాగ్యశ్రీ మొదటి సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పుకుంది. కుర్రాళ్లని కళ్లతోనే కట్టిపడేసే భాగ్యశ్రీ…సోషల్ మీడియాలో తాజా ఫోటోలను షేర్ చేసింది.

నైజీరియాలోని లాగోస్ లో భాగ్యశ్రీ బోర్సే చదువుకుంది. భారతదేశం తిరిగి వచ్చి ఆమె బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీలో చేరింది. ఆ సమయంలోనే మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుని క్యాడబరీ సహా వివిధ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసింది.

తరువాత హిందీలోనే ‘చందూ చాంపియన్’ సినిమాలో నటించింది. తెలుగులో ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలోని సాంగ్స్ లో హరీష్ శంకర్ భాగ్యశ్రీని చాలా గ్లామరస్ గా చూపించారు. దీంతో యూత్ ని భాగ్యశ్రీ ఇట్టే ఎట్రాక్ట్ చేసింది.

మిస్టర్ బచ్చన్ చిత్రం హిట్ కాకపోవడంతో భాగ్యశ్రీ బోర్సేకి హీరోయిన్ గా బ్రేక్ రాలేదు. అయితే ఆ సినిమా విడుదల కాకుండానే విజయ్ దేవరకొండకి జోడీగా ‘VD12’ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ ఛాన్స్ అందుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో భాగ్యశ్రీ సూపర్ సక్సెస్ అందుకుంటాననే నమ్మకంతో ఉంది.

ఇటీవల దుల్కర్ సల్మాన్, రానా కాంబినేషన్ లో ప్రారంభమైన సినిమాలో హీరోయిన్ గా కూడా భాగ్యశ్రీకి చాన్స్ వచ్చింది. దుల్కర్ సల్మాన్ తో మళయాలంలో తెరకెక్కితున్న కాంత సినిమాతో తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్దం అవుతోంది.

courtesy: instagram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com