ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు అధికార పార్టీకి ఝలక్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్ధానాల్లో అధికార పక్షానికి వ్యతిరేక వర్గం అభ్యర్ధులు గెలుపొందారు. వాస్తవానికి ఉపాధ్యయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రమేయం లేకపోయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్ధితులు లేవు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ పట్టభద్రుల ఎన్నికలు కానీ పార్టీ రహితంగా ఏ ఎన్నికలు జరిగినా వాటిని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం మన తెలుగు రాష్ట్రాల్లోనే కనిపిస్తుంది. తాజాగా తెలంగాణలో జరిగిన రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభ్రద ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో రెండు ఉపాధ్యాయ స్ధానాల్లో ఒక దానిలో బీజేపీ బలపరచిన మల్క కొమురయ్య గెలుపొందగా మరో దానిలో పీఆర్టీయూ అభ్యర్ధి శ్రీపాల్రెడ్డి గెలుపొందారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి బీజేపీ బలపరచిన మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందారు. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్ధానం నుంచి పీఆర్టీయూ బలపరిచని శ్రీపాల్రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్ధానం కోసం 19 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పై రెండో ప్రాధాన్యత ఓట్లతో శ్రీపాల్ రెడ్డి 5512 మెజార్టీతో గెలుపొందారు. శ్రీపాల్ రెడ్డికి 13వేల 969 ఓట్లు పోలవ్వగా, నర్సిరెడ్డికి 8వేల 848 ఓట్లు పోలయ్యాయి. ఇక కరీనంగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఎమ్మెల్సీ స్ధానంలో మొత్తం 25 వేల 41 ఓట్లు పోలవ్వగా అందులో 24వేల 144 చెల్లుబాటు అయ్యాయి. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య 12వేల 959 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి వంగ మహేందర్రెడ్డిపై 5వేల 777ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఇక కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్ధానానికి కౌంటింగ్ కొనాసాగుతోంది. ఈ నియోజకవర్గం పరిధిలో దాదాపు 3.55 లక్షల ఓట్లు ఉండగా అందులో 2 లక్షల 50వేల 106 ఓట్లు పోలయ్యాయి. వీటిలో సోమవారం రోజు లక్ష ఓట్లను లెక్కించారు. వాటిలో 92 వేల ఓట్లు చెల్లుబాటు కాగా 8వేల ఓట్లు చెల్లని ఓట్లుగా అధికారులు ప్రకటించారు. మిగిలిన ఓట్ల లెక్కింపు మంగళవారం సాయంత్రం వరకూ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్ధానాల్లో ఒకటి బీజేపీ మరొకటి పీఆర్టీయూ గెలుపు
- Advertisement with us -