24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

విప్ ధిక్కరించిన వారిపై బీజేపి సీరియస్

  • ఆ ఎంపీలు, మంత్రులపై చర్యలు?
  • వన్ నేషన్ బిల్లు పై సభ్యుల ధిక్కారం?

ఒకే దేశం …ఒకే ఎన్నిక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడంపై బీజేపిలోనే భిన్నాభిప్రాయాలున్నాయా? అధిష్టానం విప్ జారీ చేసినా 20 మంది బీజేపీ ఎంపీలు సభకు గైర్హాజరవడంపై ఇప్పుడు చర్చ పెరుగుతోంది. సభా ముఖంగా విప్ ను ధిక్కరించి గైర్హాజరైన ఎంపీలపై  హై కమాండ్ చర్యలు తీసుకుంటుందా? నిన్న పార్లమెంటు ఉభయ సభల్లోనూ  వన్ నేషన్ వన్ బిల్లును బీజేపి ప్రవేశ పెట్టింది. అయితే ఈ సందర్భంగా 20 మంది బీజేపీ ఎంపీలు సభకు గైర్హాజరయ్యారు. దీనిపై సీరియస్ గా రియాక్టయిన హై కమాండ్ వారందరినుంచి   వివరణ కోరింది. వీరిలో  కొందరు ముందే డిసైడ్ చేసిన కార్యక్రమాల వల్ల రాలేకపోయాం అంటుంటే.. మరికొందరు  అసలు వివరణ ఇవ్వడంపై కూడా శ్రద్ధ పెట్టడం లేదు. అసలు కేబినెట్ ప్రతిపాదిత బిల్లును మంత్రులే సమర్ధించడం లేదన్న  వాదనలు  ఇప్పుడు రేగుతున్నాయి.కేంద్ర మంత్రులు భరీరథ్ చౌదరి, సి. ఆర్. పాటిల్, జ్యోతిరాదిత్య సింధియా, నితిన్ గడ్కరి లాంటి వారు కూడా  సభకు రాకపోవడం బీజేపిని కాస్త ఇబ్బంది పెట్టే విషయమే.. వీరిలో కొందరు ఇప్పటికే తమ వివరణ ఇచ్చారు. రాజస్థాన్ ఎంపీలు, కేంద్ర మంత్రులు అయిన భగీరథ్ చౌదరి, సిఆర్ పాటిల్ రాజస్థాన్ లో ప్రభుత్వ ఏడాది విజయోత్సవ వేడుకల్లో బిజీగా ఉన్నారు. ప్రధాని కూడా హాజరవుతున్న ఆ వేడుకల  కోసం వారిద్దరూ సభకు రాలేదు. ఆ మేరకు వారు వివరణ కూడా ఇచ్చారు.

మంత్రులే ధిక్కరిస్తే…

ఇక  విప్ ను ధిక్కరించిన మరికొందరు కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, నితిన్ గడ్కరీ, గిరిరాజ్ సింగ్, జగదంబికా పాల్, శంతను ఠాకూర్ లనుంచి వివరణ  తీసుకోవాలని బీజేపి అధిష్టానం నిర్ణయించుకుంది. బిల్లులను సభలో ప్రవేశ పెట్టడంలో బీజేపి సక్సెస్ అయినా.. పార్టీ ఆదేశాలను  ఈ ఎంపీలు ధిక్కరించడం బీజేపీ  పరువు తీసేసినట్లయింది.   ట్రెజరీ బెంచీలో సభ్యులే ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలపడం లేదంటూ నిన్నే కాంగ్రెస్ విమర్శలు కూడా చేసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com