ప్రజా నమ్మక ద్రోహి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మాజీ మంత్రి, వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తానంటూ జనానికి అరచేతిలో స్వర్గం చూపించి.. ఇప్పుడు మాత్రం సూపర్ సిక్స్ హామీలు ఇవ్వలేమంటూ ప్రజలను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. పెనుకొండ మండలం వెంకటగిరిపాళ్యములో ఉషాశ్రీచరణ్ మీడియాతో మాట్లాడారు. రాస్ట్రంలో కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఎన్నికల్లో గెలిచాక ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం కుదరదని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. హామీలు నెరవేర్చలేని స్థితిలో ప్రభుత్వం ఉందని చంద్రబాబు చెప్పడం చాలా బాధాకరమన్నారు. ప్రజలు అమాయకులు, వాళ్లకు కల్లబొల్లి మాటలు చెప్పి కాలం గడుపుదాం అనుకుంటున్నారా.. అని ప్రశ్నించారు. ఓటు వేసి గెలిపించిన ప్రజలను మోసం చేస్తారా? మీ మనసులో ఏముంది? అని ఉషా శ్రీచరణ్ నిలదీశారు. కూటమి నేతలు అబద్ధాలు చెప్పారు కాబట్టే గెలిచారన్నారు.
- Advertisement with us -