28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

ఇస్కాన్ పై నిషేధం దిశగా బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. త్వరలోనే ముస్లీం దేశంగా మారేందుకు బంగ్లాదేశ్ ప్రయత్నాలు చేస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ క్రిష్ణదాస్ ను అరెస్టు చేయటం.. వెనువెంటనే ఇస్కాన్ సంస్థను నిషేధించాలని బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు  కావటం అందుకు బలం చేకూరుస్తోంది. బంగ్లాదేశ్ లో జమాత్ ఏ ఇస్లామీ సంస్థ ఇస్లామిక్ చాందసవాదం జడలు విప్పటంతో హిందువులు దిన దిన గండంగా జీవనం గడుపుతున్నారు.

ఇస్కాన్ దేవాలయాలు బంగ్లాదేశ్‌తోపాటు పాకిస్థాన్‌లో కూడా ఉన్నాయి. పాకిస్తాన్‌లోని ఇస్కాన్ తో పోలిస్తే.. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ఈ మధ్య వార్తల్లో నిలిచింది. దీనికి కారణం పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ గా ఏర్పడినప్పుడు.. బంగ్లాదేశ్ జనాభాలో దాదాపు 20 శాతం హిందువులు ఉండేవారు. ప్రస్తుతం ఆ దేశంలో హిందువుల సంఖ్య 9% కంటే తక్కువగా ఉంది. దశాబ్దాలుగా హిందువులకు షేక్ హసీనా, అవామీ లీగ్ పార్టీ మద్దతుగా ఉన్నా… ఆ దేశంలో హిందువుల సంఖ్య తగ్గుతూనే ఉంది. ఇస్కాన్ సంస్థ హిందువులకు ధర్మంపై భోదిస్తూ వారిలో సనాతన ధర్మంపై అవగాహన కల్పిస్తోంది. ఇటీవల ఆ దేశంలో అధికారం మారడంతో.. హిందువులకు చెడ్డ రోజులు ప్రారంభమయ్యాయి.

బంగ్లాదేశ్‌లోని మైనారిటీలు దుర్మార్గులకు, అల్లర్లు చేసే వారికి లక్ష్యంగా మారుతున్నారని వివిధ నివేదికల్లో వెలుగు చూసింది. BBC నివేదిక ప్రకారం జనవరి 2013 నుంచి సెప్టెంబర్ 2021 మధ్య హిందూ సమాజంపై కనీసం 3,679 సార్లు దాడులు జరిగాయి.

హసీనా అధికారం నుంచి తప్పుకున్న తర్వాత హిందువులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 90% ముస్లిం జనాభా ఉన్న దేశంలో సోషలిజం, లౌకికవాదం వాస్తవికతను ప్రతిబింబించవని ఆ దేశ అటార్నీ జనరల్ MD అసదుజ్జమాన్ అన్నారు. ఇందుకు బలం చేకూరుస్తూ బంగ్లాదేశ్‌ను ఇస్లామిక్‌ రాజ్యంగా ప్రకటించాలనే డిమాండ్‌ మొదలైంది.

బంగ్లాదేశ్‌లో చిన్మోయ్ కృష్ణ దాస్ అధ్వర్యంలో ఇస్కాన్‌కు ఆదరణ పెరుగుతోంది. చిన్మోయ్ కృష్ణ దాస్ కు ఫాలోవర్లు పెరుగుతున్నారు. ఇస్కాన్ అనేక హిందూ పండుగలలో చురుకుగా పాల్గొంటుంది. ముఖ్యంగా జన్మాష్టమి వేడుకల సమయంలో మత బేధం లేకుండా ఆ దేశంలోని పేదలకు రేషన్ కూడా అందజేస్తోంది. ఇస్కాన్ అధర్యంలో చిన్మోయ్ కృష్ణ దాస్ చేస్తోన్న పనులు, ధర్మ ప్రచారం.. ఇస్కాన్ ఆదరణ యూనస్ ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. ఇస్కాన్ మీద కోపంతో చిన్మోయ్ కృష్ణ దాస్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

వీటన్నింటి వెనుక జమాత్ ఏ ఇస్లామీ సంస్థ హస్తం ఉందని సమాచారం. పాకిస్థాన్ లో చిచ్చుకు కారణమైన ఈ సంస్థ ఇప్పుడు బంగ్లాదేశ్ ను భ్రష్టు పట్టించే కుట్ర చేస్తోందని మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. బంగ్లాదేశ్ ను ఇస్లామిక్ రాజ్యంగా చేసేందుకే… హసీనా ప్రభుత్వాన్ని కూల్చారని, అందుకు విద్యార్థి లోకాన్ని పావులుగా వాడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com