ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. శణివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఏక కాలంలో ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ సారి ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఏక కాలంలో విడుదల చేసింది. గతంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలు రెండో సంవత్సరం క్లాసులు ప్రారంభమైన తరువాత వచ్చేవి. కానీ ఈ సారి జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వాట్సప్ గవర్నెన్స్ లో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన వాట్సప్ నెండర్ కి హాయ్ అని సందేశం పంపడం ద్వారా ఇంటర్ పరీక్షా ఫలితాలను తెలుసుకోవచ్చు. వాట్సప్ గవర్నెన్స్‌లో మనమిత్ర చాట్ లో హాయ్ అని మెసేజ్ చేస్తే వెంటనే ఫలితాలు మెసేజ్ రూపంలో మన చాట్ విండోకి వచ్చేస్తాయి. ఫలితాలను తెలుసుకునేందుకు హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఉంటే ఫలితాలు తెలుసుకోవచ్చు.
విద్యార్ధులు మనమిత్ర వాట్సప్ నెంబర్ 9552300009 ద్వారా గానీ http://resulsbie.ap.gov.in వెబ్ సైట్ ద్వారా గానీ జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ ఫలితాలు తెలుసుకోవచ్చు.