భారీ అంచనాల నడుమ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. రాస్ట్ర అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఉదయం పది గంటల సమయంలో పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.3,22,359 కోట్లతో కూడిన బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లుగా.. రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లుగా పేర్కొన్నారు. ఇక, రాష్ట్రంలో ద్రవ్య లోటు రూ.79,926 కోట్లు, మూల ధన వ్యయం రూ.40,635 కోట్లుగా మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ తొలిసారి రూ.3 లక్షల కోట్ల మార్క్ దాటేయడం ఈ సారి బడ్జెట్ హైలైట్. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు చేయాల్సి రావడంతో ఏపీ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు దాటింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు పయ్యావుల కేశవ్. బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.48వేల కోట్లు కేటాయించారు. స్వర్ణాంధ్ర విజన్ -2047 పేరుతో రూపొందించిన ప్రణాళికలకోసం పది సుత్రాల పేరుతో తొలిసారి ఏపీ బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు చేశారు.
గతేడాది రూ. 2.94. లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి బడ్జెట్ రూ.3,22,359 కోట్లకు చేరింది. అలాగే, ఈ సారి వ్యవసాయ రంగానికి భారీగా కేటాయింపులు పెరిగాయి. రైతుల కోసం ఈసారి రూ.48,340 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. గతేడాది బడ్జెట్ రూ.43,402.33 కాగా, ఈసారి కేటాయింపులు భారీ స్థాయిలో పెరిగాయి.
2025-26 బడ్జెట్ ప్రకారం ఏపీ ఆదాయం, కేటాయింపులు చూస్తే…
-
ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3,22,359 కోట్లు
-
మొత్తం రెవెన్యూ రాబడి రూ.2,17,977 కోట్లు
-
రెవెన్యూ రిసీప్ట్స్ రూ.1,04,382 కోట్లు
-
క్యాపిటల్ ఎక్స్పెడెచర్ రూ.40,636 కోట్లు
-
రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు
-
రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు
-
ద్రవ్య లోటు రూ.79,926 కోట్లు
-
మూల ధన వ్యయం రూ.40,635 కోట్లు
-
పన్నుల ద్వారా సొంతంగా వచ్చే ఆదాయం రూ.1,09,007 కోట్లు
-
నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఆదాయం రూ.19,119 కోట్లు
-
కేంద్ర పన్నుల వాటా రూ.57,566 కోట్లు
-
అమరావతి నిర్మాణం కోసం కోసం రూ.6,000 కోట్లు
-
రహదారుల నిర్మాణానికి రూ.4,220 కోట్లు
-
పరిశ్రమలు, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం రూ.12,112 కోట్లు
-
ఆర్ధిక మరియు సాంకేతిక అభివృద్దికి రూ.55,730 కోట్లు
-
సామాజిక తరగతుల అభివృద్దికి రూ.1,42,349 కోట్లు
-
కరువు రహిత రాష్ట్రం, వ్యవసాయం కోసం రూ.29,665 కోట్లు