24.6 C
Hyderabad
Thursday, October 29, 2026

Live Video

spot_img

చైనాలో మరో వైరస్

చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. హ్యూమన్ మెటానిమో వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా పోస్టింగ్స్ ద్వారా ఈ వ్యాధి చైనాలో వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రుల ముందు రోగులు క్యూ కడుతున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు ఇన్‌ఫ్లుయెంజా ఏ, HMPV, మైకోప్లాస్మా నిమోనియా, కోవిడ్-19తో పాటు మల్టిపుల్ వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచమంతా గ్రాండ్‌గా కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పిన కొన్ని గంటలకే, మరో మహమ్మారి వ్యాప్తి గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం X సహా ఇతర అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్స్.. చైనాలో వివిధ రకాల వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నట్లు తెలిపే పోస్టులతో నిండిపోయాయి. కరోనా పుట్టినిల్లు చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించినట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, ప్రజలు హ్యూమన్ మెటానిమో అనే వైరస్ బారిన పడుతున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

అయితే HMPV ఫ్లూ లక్షణాలతో పాటు కోవిడ్-19 లక్షణాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. వైరస్ వ్యాప్తి చెందడంపై అక్కడి అధికారులు పరిస్థితులను పరిశీలిస్తున్నారు. వైరస్ సోకిన వారిలో దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్తమా, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లేదా ఎంఫిసెమా వంటి లంగ్స్ జబ్బులు ఉన్నవారికి ప్రమాదం ఎక్కువగా ఉందని చైనా అధికారులు తెలిపారు.

మరోవైపు వైరస్ కారకాలను గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసినట్లు సమాచారం. డిసెంబర్ 16-22 వరకు అందిన డేటా ప్రకారం.. చైనాలో HMPV సహా తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరిగాయి. చలికాలంలో శ్వాసకోశ వ్యాధులు మరింత పెరిగే అవకాశం ఉందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా మాస్కులు ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని గ్లోబల్ హెల్త్ అధికారులు సిఫార్సు చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com