పాకిస్థాన్ లో ఈ రోజు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఆ భూకంప తీవ్రత 4.2 పాయింట్లుగా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ఈ విషయాన్ని వెల్లడించింది. ఈరోజు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు పాకిస్థాన్‌లో భూమి కంపించిందని ఎన్‌సీఎస్ అధికారులు తెలిపారు. భూ కంపం నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
పాకిస్తాన్ భౌగోళికంగా యురేషియా, భారత టెక్టోనిక్ ప్లేట్లపై వ్యాపించి ఉంది. పాకిస్తాన్ లోని ఖైభర్ పంక్తూంఖ్వా, గిల్గిట్ బాల్టిస్తాన్, బలుచిస్తాన్ ప్రాంతాలు భూ కంపాలకు కేంద్రంగా ఉన్నాయి. వీటితోపాటు పాకిస్థాన్ ఆధినంలోని ఆక్రమిత కాశ్మీర్ కూడా ఉంది. వారం రోజుల్లోనే రెండు భూ కంపం ఆ దేశ ప్రజలను వణికిస్తోంది.
బలూచిస్తాన్, సమాఖ్య పరిపాలన గిరిజన ప్రాంతాలు, ఖైబర్ పఖ్తుంఖ్వా మరియు గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రావిన్సులు ఇరానియన్ పీఠభూమిపై యురేషియా ప్లేట్ దక్షిణ అంచున ఉన్నాయి. సింధ్, పంజాబ్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ, కాశ్మీర్ ప్రావిన్సులు దక్షిణాసియాలోని భారత ప్లేట్ వాయువ్య అంచున ఉన్నాయి.
పాకిస్థాన్ ప్రభుత్వం వనరులు దోచుకొని నిర్లక్ష్యం చేస్తోందని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఆర్థికంగా చితికిపోయిన పాకిస్థాన్‌ను ఇప్పుడు సమస్యలన్నీ చుట్టుముట్టాయి. ఈ క్రమంలో పాక్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.