34.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

రష్యాకు మద్దతుగా అమెరికా… దిగొచ్చిన ఉక్రెయిన్…

అమెరికా యస్ అంటే.. రష్యా నో అంటోంది.. అదే రష్యా యస్.. అమెరికా నో అంటోంది.. ఇది అనేక దశాబ్ధాలుగా జరుగుతూ వస్తున్నదే. కానీ చాలా కాలం తర్వాత రష్యాకు వ్యతిరేకంగా ఓ దేశం తీర్మానం ప్రవేశపెడితే.. దానిని ఖండిస్తూ ఆ దేశానికి మద్ధతుగా నిలిచింది అమెరికా. నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా ఇది నిజం.

దేశ భూభాగం నుంచి రష్యా వైదొలగాలని డిమాండ్‌ చేస్తూ యూనైటెడ్ నేషన్స్‌లో ఉక్రెయిన్‌ ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది అమెరికా. అయితే యూరప్ దేశాలు అనుకూలంగా ఓటు వేయడంతో అది ఆమోదం పొందింది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు అనుకూలంగా ఓటేయడం అమెరికాకు ఇదే తొలిసారి. ఈ తీర్మానానికి అనుకూలంగా 93 దేశాలు ఓటేయగా, 18 దేశాలు వ్యతిరేంచాయి. భారత్‌ సహా 64 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు.

ఇదే సమయంలో ఉక్రెయిన్ నుంచి మరో కీలక ప్రకటన వెలువడింది. అమెరికా ఆఫర్ చేసిన డీల్‌కు కొన్ని సవరణలు చేశామని.. ఆ సవరణలతో కూడిన డీల్‌ను కుదుర్చునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. దీంతో అమెరికా వేసిన ఎత్తులు పారినట్టే కనిపిస్తోంది.

నిజానికి ఈ డీల్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా నిక్కచ్చిగా ఉన్నారు. తాము ఉక్రెయిన్‌కు ఎందుకు ఉచితంగా సహాయం చేయాలి.. ఆ దేశంలో ఉన్న ఖనిజాలను అమెరికా కంపెనీలు తవ్వుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి 500 బిలియన్ డాలర్ల డీల్‌ను ఉక్రెయిన్ ముందు ఉంచారు. చేసిన సాయం 100 బిలియన్ డాలర్లు అయితే.. ఈ స్థాయిలో ఒప్పందాలు సరైంది కాదంటున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఇదే విషయాన్ని మొదట బహిరంగంగానే చెప్పారు. కానీ ఇప్పుడు అమెరికా చర్యల కారణంగా దిగిరాక తప్పలేదనిపిస్తోంది.

అమెరికా నుంచి మరో ప్రకటన కూడా వెలువడింది. జెలెన్ స్కీ వచ్చేవారం అమెరికాలో పర్యటిస్తారని.. ఈ డీల్‌పై సంతకం చేస్తారని చెప్పింది. కానీ ఉక్రెయిన్‌ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ మధ్య అమెరికా ప్రకటనలు ఎంత వరకు వాస్తవం అనేది అర్థం కావడం లేదు. అమెరికా ప్రపోజ్ చేసిన డీల్‌కు ఉక్రెయిన్ అంగీకరించిందని మొదట ట్రంప్ ప్రకటించారు. కానీ అలాంటిదేం జరగలేదని ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పుడేమో జెలెన్ స్కీ అమెరికాలో పర్యటిస్తారని చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవమో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com