పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సిందూర్ కు శ్రీకారం చుట్టాయి. ఈ క్రమంలో ఉత్తర భారతదేశంలోని పలు విమానాశ్రయాలు మూసివేయనున్నారు. 16 విమానాశ్రయాలకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. పాకిస్థాన్ సరిహద్దుల్లోని లడక్ రాష్ట్రంలోని లేహ్, థోయిస్ జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్, జమ్మూ, హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల, సిమ్లా పంజాబ్ లోని అమృత్‌సర్, పఠాన్‌కోట్, భటిండా, చండీగఢ్ రాజస్థాన్ లోని జోధ్‌పూర్, జైసల్మేర్, జామ్‌నగర్, గుజరాత్ లోని భుజ్, రాజ్‌కోట్, పోర్‌బందర్ విమానాశ్రయాలు మూసివేస్తున్నారు. విమానాశ్రయాలతోపాటు విద్యాసంస్థల్ని కూడా మూసివేశారు.
ఈ మేరకు విమాన ప్రయాణికులకు ఎయిర్ లైన్స్ సంస్థలు సూచనలు చేస్తున్నాయి. తదుపరి నోటీసు వచ్చే వరకు అవి సేవలు అందించవని అధికారులు స్పష్టం చేశారు. వీటి కారణంగా ప్రస్తుత రాకపోకలకు టికెట్లు బుక్ చేసుకున్న వారి జర్నీ ప్రభావితం కావచ్చు. ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమే, లేక ప్రత్యామ్నాయం ప్లాన్ చేసుకోవాలని ఎయిర్ లైన్స్ సంస్థల ప్రతినిధులు సూచించారు.