38.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

ఇంకా సెమీస్ రేసులో అఫ్ఘాన్.. ఎలాగంటే?

ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. దీంతో సెమీస్‌లోకి చేరింది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్‌ ఫలితం ఎటూ తేలకపోవడంతో అఫ్ఘాన్ ఇంటి దారి పట్టినట్టే అనుకుంటున్నారు. కానీ అఫ్ఘాన్ సెమీస్‌కు చేరుతుందా? లేదా? అనేది ఇంగ్లండ్, సౌతాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్‌ తేల్చనుంది.

మూడు టీమ్‌లు ఇప్పటికే ఛాంపియ‌న్స్ ట్రోఫీలో సెమీ ఫైన‌ల్ బెర్తులను కన్ఫామ్ చేసుకున్నాయి. గ్రూప్ ఏ నుంచి ఇండియా, న్యూజిలాండ్ సెమీస్‌లో అడుగుపెట్టాయి. గ్రూప్ బీ నుంచి ఆస్ట్రేలియా సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సెమీఫైన‌ల్‌ బెర్తును ఖాయం చేసుకునే నాలుగో జ‌ట్టు ఏది అనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఆ నాలుగో టీమ్‌ ఏదో తేలడంతో పాటు సెమీస్‌లో ఇండియాతో త‌ల‌ప‌డ‌నున్న జ‌ట్టు కూడా ఏద‌న్నది క్లారిటీ వ‌స్తుంది.

గ్రూపు బీ చివ‌రి లీగ్ మ్యాచ్‌ రావ‌ల్పిండి వేదిక‌గా జరగనుంది. ఇంగ్లండ్‌, ద‌క్షిణాఫ్రికా త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిస్తే 5 పాయింట్లతో గ్రూప్‌ టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఒక‌వేళ ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం 3 పాయింట్లతో అఫ్ఘానిస్తాన్‌తో సమంగా ఉంటుంది. అప్పుడు రన్‌రేట్‌ పరిగణనలోకి వస్తుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా నెట్ ర‌న్ రేట్ 2.140 ఉండ‌గా అఫ్ఘానిస్తాన్ ర‌న్ రేట్ -0.990 ఉంది. ర‌న్‌రేట్ ప్రకారం చూసుకున్నా సౌతాఫ్రికానే సెమీస్‌లో అడుగుపెడుతుంది. కానీ ఏదైనా అధ్భుతం జరిగాలి. ఆ అద్భుతం ఎలాగంటే.. ఇంగ్లండ్ 300 పరుగులు చేసి.. సౌతాఫ్రికాను 93 పరుగులకు ఆలౌట్ చేయాలి. అప్పుడే అఫ్ఘాన్‌ సెమీస్‌కు చేరే అవకాశాలుంటాయి. కానీ సౌతాఫ్రికా ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉంది. అలా జరిగే అవకాశాలు లేనట్టే. మొత్తానికి సౌతాఫ్రికా గెలిచినా.. ఓడినా సెమీస్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com